Sunday, March 22, 2026

‘నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతడు అఫ్రిదీ ఫోటోలు చించేశాడు’

కొన్నిసార్లు అభిమానం చాలా దూరం వెళుతుంది. తమ అభిమాన నటుడు, అభిమాన ఆటగాడు, ఇష్టమైన సెలబ్రిటీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సదరు ఫ్యాన్ తట్టుకోలేరు. అంతేకాదు.. ఈ విషయంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీ కూడా ఇదే చేసింది. హ్యూమా ఖురేషీకి, సకీబ్‌ సలీం మధ్య జరిగిన ఓ విషయంలో తమ అభిమాన క్రికెటర్ల విషయంలో ఇదే జరిగింది. హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన “గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌” సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్‌ ఖాన్‌, హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌‌లు “యారోంకి బారాత్‌” అనే చాట్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ షోకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి ఇటీవల హాజరైంది. ఈ క్రమంలోనే తన చిన్నతనంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్‌ నటుడు సకీబ్‌ సలీంకు తనకు మధ్య జరిగిన ఓ సంఘటన గురించి వివరించింది. ‘సకీబ్ సలీంకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంటే ఎంతో ఇష్టం. ఓ సందర్భంలో అతనితో నాకు గొడవ జరిగింది. ఆ కోపంలోనే అతని ఆరాధ్య దైవమైన సచిన్‌ పోస్టర్లను చించేశాను. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఫోటోలను చించేశాడు.

కాగా.. ఇదే సమయంలో షో హోస్ట్‌లు.. ‘నువ్వు సచిన్‌ పోస్టర్లను చించావా..? అని ప్రశ్నించారు. దీంతో హ్యూమా ఖురేషీ చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్‌ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న, చెళ్లెళ్ల మధ్య అనుకోకుండా చోటు చేసుకుందని చెప్పింది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్‌ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్‌ స్టైల్‌ తనను బాగా ఆకట్టుకునేవని చెప్పుకొచ్చింది. ‘90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో అఫ్రిదీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. కాబట్టి నేను కూడా అతనికి అకర్షితురాలినయ్యాను.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -