Sunday, March 22, 2026

ఆర్సీబీ ఓకే.. కానీ కోహ్లీ కాదు.. రష్మిక ఇలా చెప్పిందేంటి..?

ఈ మధ్యనే ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఇష్టమంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న పేర్కొంది. ‘ఈ సాలా కప్ నందే’ అని కోడ్ లాంగ్వేజ్‌లో ఈ విషయం చెప్పింది. అయితే తాజాగా ఈ విషయంలో రశ్మిక తన మాట మార్చింది. తనకు ఆర్సీబీ అంటే ఇష్టమేనని, కానీ కోహ్లీకి తాను ఫ్యాన్ కాదని చెప్పింది. తనకు ఐపీఎల్‌ అంటే తనకు పిచ్చి అని, ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ ఎలాగైనా సాధించాలని ఆశించినట్లు చెప్పింది.

అయితే తాజాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో లీగ్ అర్థాంతరంగా ముగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే రశ్మిక మళ్లీ ఆన్‌లైన్‌లోకొచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ వాయిదా పడడంతో ఆర్‌సీబీ అభిమానిగా తాను చాలా బాధపడుతున్నానని రశ్మిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగానే అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు రశ్మిక సమాధానం చెప్పింది.

ఈ క్రమంలోనే తనకు ఆర్సీబీ ఫ్యాన్‌ని అని, కానీ కోహ్లీకి ఫ్యాన్ కాదని చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకు టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతని బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, సారధ్యం అన్నీ తనకు బాగా నచ్చుతాయని, అతనో మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌ అని అభివర్ణించింది. క్రికెట్‌లో ధోని తన ఆల్‌టైమ్‌ హీరో అని ఆకాశానికెత్తింది.

కాగా రశ్మిక సమాధానంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే కొంతమంది మాత్రం రశ్మికను తెగ ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ టీమిండియా కెప్టెన్ అని, అతడు ఇష్టం లేదంటూ చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -