Wednesday, January 22, 2025

రవిశాస్త్రి-కోహ్లీ ఆడియో లీక్.. ప్లాన్ బయటపడిపోయిందే..

లండన్‌: న్యూజిల్యాండ్‌ను ఎలా దెబ్బకొట్టాలని కోహ్లీ అనుకుంటున్నాడో తెలుసా..? దానికోసం టీమిండియాలో ఏఏ బౌలర్లను ఉపయోగించబోతున్నాడో తెలుసా..? వీటన్నింటికీ సంబంధించి కోచ్ రవిశాస్త్రి-కెప్టెన్ కోహ్లీ మధ్య జరిగిన ఓ సంభాషణకు సంబందించిన ఆడియో ఇప్పుడు బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కివీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనున్న నేపథ్యంలో దానికోసం టీమిండియా ఇప్పటికే చాలా ప్లాన్స్ రెడీ చేసుకుంది. అందులో భాంగంగానే కవీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఎలా అవుట్ చేయాలనే దానిపై కూడా ఓ స్ట్రాటజీ వేసుకుంది. అయితే ఇప్పుడు ఆ స్ట్రాటజీ లీక్ అయింది. దీనికి సంబంధించిన వ్యూహాలపై కెప్టెన్‌, కోచ్‌ డిస్కస్‌ చేసుకున్న మాటలు ఆడియో రూపంలో బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రి – కలిసి కోహ్లీ మాట్లాడిన విషయం తెలిసిందే. జట్టు గురించి, ఇంగ్లండ్‌లో అనుసరించబోయే పరిస్థితుల గురించి వారు వివరించారు. అయితే, ఈ సమావేశానికి కొంత సమయం ముందు రవిశాస్త్రితో కోహ్లీ వ్యక్తిగతంగా కొన్ని విషయాలపై చర్చించాడు. లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదనుకున్న కోహ్లీ.. వేదికపైనే రవిశాస్త్రితో కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు. అందులో న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఎలా ఔట్‌ చేయాలనే అంశంపై తన ప్లాన్‌ను రవిశాస్త్రికి వినిపించాడు. ఆ ప్లాన్‌కు రవిశాస్త్రి కూడా ఓకే చెప్పాడు. ఈ ఆడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో రౌండ్ ద వికెట్ బౌలింగ్‌ చేయిస్తే కివీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌పై పై చేయి సాధించవచ్చని కోహ్లీ చెప్పాడు. ఆ ప్లాన్‌కు రవిశాస్త్రి కూడా ఓకే తెలిపాడు. అయితే, ఈ మాటలు డైరెక్ట్‌గా లైవ్‌లో వచ్చేయడంతో టీమిండియా ప్లాన్ బయటకొచ్చేసింది.

కాగా, సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన భారత జంబో జట్టు బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరింది. ఇప్పటికే ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకున్న ఈ జట్టు ఇంగ్లండ్ చేరాక అక్కడ కూడా మరో 10 రోజులు క్వారంటైన‌లో ఉండనుంది. అయితే మూడు రోజుల తర్వాత ప్రాక్టీస్‌కు అనుమతించనున్నట్లు ఈసీబీ ఇప్పటికే చెప్పింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x