Friday, November 1, 2024

కోహ్లీ డైట్‌పై నెటిజన్ల ట్రోల్స్.. కోహ్లీ రిప్లై ఇదే..!

టీమిండియా కెప్టెన్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం శాకాహారిగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాంసానికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రాం వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన కోహ్లీ.. తన డైట్‌లో గుడ్లున్నాయని చెప్పాడు. దీంతో అనేకమంది నెటిజన్లు కోహ్లీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ‘వెజిటేరియన్‌ అని చెప్పి గుడ్లు తింటావా.. ఇక నువ్వు శాకాహారివి ఎలా అవుతావ్..?’ అంటూ ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ ట్రోల్స్‌పై కోహ్లీ తన స్టైల్లో రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్లంతా క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే కోహ్లీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ‘మీ డైట్ వివరాలు చెప్పండి’ అని అడగడంతో.. తన డైట్‌లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోశలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని మితంగా తీసుకుంటానని తెలిపాడు. అయతే కోహ్లీ గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్‌గా మారనని గతంలో చెప్పిన కోహ్లీ చెప్పినట్లు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడిలా గుడ్లు తింటున్నానని చెప్పడంతో కోహ్లీనే నేరుగా ప్రశ్నించారు.నెటిజన్లంతా తన ఎగ్‌డైట్‌పై ప్రశ్నలు కురిపిస్తుండడంతో కోహ్లి.. ఘాటుగానే బదులిచ్చాడు. ‘నేను శాఖాహారిని అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికే అలానే ఉంటానని కూడా అనలేదు. గట్టిగా గాలి పీల్చుకొని మీ కూరగాయాలు మీరు తినండి’ అంటూ ఫన్నీ ఎమోజీలతో ట్వీట్ చేశాడు. ఇక కోహ్లీ చేసిన ఈ ట్వీట్ కూడా ప్రస్తుతం వైరలవుతోంది.

అయితే గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా వేదికగా లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు. వెన్నుముకలో తలెత్తిన సమస్య కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అది తనకు మేలు చేసిందని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఇలా కోహ్లీ మాట మార్చడం ఏంటో అర్థం కావడం లేదు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x