Monday, March 23, 2026

పెళ్లి చేసుకోబోతున్న పాక్ కెప్టెన్ బాబర్.. ఎవరినంటే..!

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(26) మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. గత కొంత కాలంగా మామ కూతురితో ప్రేమలో మునిగి తేలుతున్న బాబర్ ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇరు కుటుంబాల
మధ్య మాటలు పూర్తయ్యాయని, పెద్దలు పరస్పర అంగీకారానికి వచ్చాక, వచ్చే ఏడాది ఆరంభంలో వీరి జంట ఒక్కటవుతుందని బాబర్‌ సన్నిహితులు
ద్వారా తెలుస్తోంది.

కాగా, బాబర్‌ పెళ్లి విషయమై సహచర ఆటగాడు, పాక్‌ మాజీ కెప్టెన్‌ అజహర్‌ అలీ ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌కు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. అయితే యాదృచ్చికంగా అజహర్‌ అలీ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే పాక్‌ కెప్టెన్‌ పెళ్లి విషయమై వార్తలు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే, గత కొద్ది కాలంగా బాబర్ అజాం పాక్ కెప్టెన్‌గా ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. అత్యుత్తమ ఫామ్‌తో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నాడు. ఇటీవలే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి ప్రపంచ నెంబర్‌ 1 బ్యాట్స్‌మెన్‌ స్థానాన్ని కూడా లాగేసుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌ను చేజిక్కించుకుని స్వదేశానికి చేరుకున్న బాబర్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) కోసం రెడీ అవుతున్నాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -