Tuesday, March 24, 2026

అక్తర్ వార్నింగ్‌తో దెబ్బకు అలా ఆడడమే మానేశా: ఊతప్ప

పాక్ మాజీ పేసర్ అక్తర్ ఇచ్చిన వార్నింగ్‌తో తాను మళ్లీ ఆ షాట్ కొట్టలేకపోయానని చెప్పాడు. 2007లో పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా అక్తర్ తనకు వార్నింగ్ ఇచ్చాడని, దాంతో ముందుకొచ్చి షాట్ ఆడే ధైర్యం చేయలేదని చెప్పాడు. సిరీస్‌లో టీమిండియా గెలిచిందని, కానీ డిన్నర్ సమయంలో అక్తర్ ఇచ్చిన వార్నింగ్ తనకు ఇప్పటికీ గుర్తుందని, ఆ వార్నింగ్‌తో తన బ్యాటింగ్‌ను మార్చుకోవాల్సి వచ్చిందని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

‘వేక్ అప్ విత్ సోరబ్’ అనే కార్యక్రమంలో కమెడియన్ సోరబ్ పంత్‌తో ఊతప్ప మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఊతప్ప అప్పటి విషయాలను పంచుకున్నాడు. గువాహటి వన్డేలో.. తాను క్రీజులో ఉన్న సమయానికి 25 బంతుల్లో 12 పరుగులు కావాలని, ఇర్ఫాన్, తాను క్రీజులో ఉన్నామని, ఆ సమయంలో షాయబ్‌ అక్తర్ బౌలింగ్‌ చేస్తున్నాడని ఊతప్ప చెప్పాడు. ‘అక్తర్ తొలి బంతిని 154 కి.మీ. వేగంతో ఓ యార్కర్ విసిరాడు. దానిని నేను ఆపగలిగాను. ఆ తర్వాత బంతికి మరో యార్కర్‌ ట్రై చేయగా.. ఫుల్ టాస్‌ వచ్చింది. దానిని నేను బౌండరీకి తరలించాను. ఇక అక్తర్‌ తరువాత బంతులను వరుస యార్కర్లుగా విసిరాడు. ఆ సమయంలో పరుగులు రావాలంటే క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తరువాత బంతికే క్రీజు బయటికొచ్చి భారీ షాట్ ఆడాను. భారీ షాట్ అయి బౌండరీ వచ్చింది. మ్యాచ్‌లో టీమిండియా గెలిచాం’ అని ఊతప్ప వివరించాడు.

కాగా.. మ్యాచ్‌ అనంతరం తాము జట్టు సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నానని, అక్తర్‌ కూడా అక్కడే ఉన్నాడని, అయితే తనను చూడగానే తన వద్దకు వచ్చాడని, రాగానే.. ‘ఇవాల్టి మ్యాచ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చి ఆడావు. కానీ మళ్ళీ అలా ఆడితే.. నీ తలకి గురిపెడుతూ బౌన్సర్‌ను వేస్తా’ అని హెచ్చరించి వెళ్లిపోయాడని ఊతప్ప పేర్కొన్నాడు. ఆ తరువాత, నేనతని బౌలింగ్‌లో అలా ఆడటానికి ధైర్యం చేయలేదంటూ అప్పటి విషయాలను ఊతప్ప వెల్లడించాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -