Wednesday, January 22, 2025

చెన్నైపై ముంబై రికార్డు విక్టరీ.. ఏకంగా 219 టార్గెట్ ఛేజ్ చేసి..

ఐపీఎల్ 14వ సీజన్లో ఓ అద్భుతమైన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసింది. టోర్నీలోనే బలమైన జట్లైన ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై విజయం సాధించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ రెండు జట్లూ పోటీ పడగా.. చెన్నై నిర్దేశించి 219 పరుగుల భారీ టార్గెట్‌ను ముంబై ఛేదించి ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించింది. ముంబై మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్(87 నాటౌట్: 34 బంతుల్లో.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సృష్టించిన విధ్వంసానికి చెన్నై తలొంచింది. బౌలర్లపై ఏ మాత్రం దయ లేకుండా భారీ బౌండరీలు బాదుతూ జట్టుకు విజయాన్నందించాడు పొలార్డ్. దీంతో ముంబై 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చెన్నై బౌలర్లలో శామ్ కర్రాన్‌కు 3 వికెట్లు దక్కగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మొయీన్ అలీ తలా ఓ వికెట్ తీశారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది రుతురాజ్ గైక్వాడ్(4) వెంటనే అవుట్ కావడంతో కేవలం 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తొలి వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ ఓపెనర్ డూ ప్లెసిస్(50: 28 బంతుల్లో.. 2ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాట్స్‌మన్ మోయీన్ అలీ(58: 35 బంతుల్లో.. 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మొదట అదరగొట్టడంతో భారీ స్కోరు దిశగా పరుగులు తీసింది. అయితే 11వ ఓవర్లో అలీ, 12వ ఓవర్లో డూ ప్లెసిస్‌ అవుట్ కావడంతో చెన్నై ఇబ్బందుల్లో పడింది. వీరితో పాటు సురేశ్ రైనా(2) కూడా నిరాశపరిచాడు. దీంతో చెన్నై 116 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక చెన్నై భారీ స్కోరు చేయడం కలేనని అంతా అనుకున్నారు.


అయితే ఆ తర్వాత క్రీజులోకొచ్చిన అంబటి రాయుడు(72 నాటౌట్: 27 బంతుల్లో.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసి రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల సునామీ సృష్టించాడు. అతడికి రవీంద్ర జడేజా(22 నాటౌట్: 22 బంతుల్లో.. 2 ఫోర్లు) తగిన సహకారం అందిస్తూ వికెట్ పడకుండా కాపాడాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్‌కు 2 వికెట్లు దక్కగా, బుమ్రా, బౌల్ట్‌లకు చెరో వికెట్ దక్కింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x