Friday, November 1, 2024

గెలిచేది టీమిండియానే: మాంటీ పనేసర్

ప్రపంచ క్రికెట్లో అత్యంత చారిత్రక ఘట్టం మరికొన్ని రోజుల్లో చోటు చేసుకోబోతోంది. తొలిసారి టెస్ట్ క్రికెట్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్ పోటీపడబోతున్నాయి. గెలిచిన జట్టు క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించబోతోంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి. జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ క్రికెటర్లు టీమిండియానే విజయం సాధిస్తుందని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ వెటరన్ స్పిన్నర్ మాంటీ పనేసర్ కూడా ఈ జాబితాలో చేరాడు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ, ఆ తర్వాత తమ జట్టుతో జరగబోయే 5 టెస్టుల సిరీస్‌లోనూ టీమిండియా తిరుగులేని విజయం సాధిస్తుందని ఇంగ్లండ్‌ జోస్యం చెప్పాడు. అలాగే ఇటీవల మార్చిలో భారత్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ ఆడలేకపోయారని, తమను ఎప్పుడూ వెంటాడుతున్న ప్రధాన సమస్య ఇదేనని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

‘ఆగస్టులో ఇంగ్లండ్‌ పిచ్‌ల నుంచి టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే ఇంగ్లండ్‌‌ని 5 టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది. ఇంగ్లండ్‌ టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్‌‌ని సమర్థంగా ఎదుర్కోలేరు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్. ఆస్ట్రేలియాని దాని సొంత గడ్డపైనే ఈ ఏడాది ఆరంభంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓడించింది టీమిండియా. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ని 3-1తో చిత్తుగా ఓడించింది. ఆ ఉత్సాహంలో ఉన్న భారత్ జట్టు తప్పక విజయం సాధిస్తుంద’ని పనేసర్‌ అభిప్రాయ పడ్డాడు.

ఇదిలా ఉంటే విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది. ఇంగ్లండ్‌‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే యూకేకు చేరుకుందని, జూన్ మొదటి వారంలో భారత జట్టు వచ్చి చేరుతుందని పనేసర్ అన్నాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌పై తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌లు ఆడబోతోంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x