Friday, November 1, 2024

ఓటమితోనే మొదలు.. మరి ఆ తర్వాత కూడా..

ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఇండియా దారుణంగా ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధవన్(4) వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. దీంతో టీమిండియాకు భారీ దెబ్బ తగిలింది. ఆ వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) కూడా దారుణంగా విఫలం కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక రిషబ్ పంత్(21) కొంత సేపు మెరుపులు మెరిపించినా కొద్ది సేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి అవుటైపోయాడు. స్టోక్స్ వేసిన స్లో బాల్‌‌ను మిడ్ వికెట్ మీదుగా బౌండరీ బాదబోయాడు. కానీ అక్కడే కాచుకుని ఉన్న బెయిర్ స్టో దానిని అందుకున్నాడు. దీంతో పంత్ మెరుపులకు ఎండ్ కార్డ్ పడింది.

పంత్ తరువాత హార్దిక్ పాండ్యా(19) కూడా కొద్ది సేపటికే పెవిలియన్‌కు చేరడం, ఆ తరువాతి బంతికే శార్దూల్ ఠాకూర్(0) కూడా అవుట్ కావడంతో కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్(67) మాత్రం అర్థసెంచరీతో మెరిశాడు. అయ్యర్ చివరివరకు క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. దీంతో టీమిండియా కనీసం 124 పరుగులైనా చేయగలిగింది. కానీ చివర్లో థర్డ్ మ్యాన్ దిశగా సిక్స్ కొట్టబోయిన అయ్యర్.. డేవిడ్ మలాన్‌ అద్బుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో రాణించగా, రషీద్, మార్క్ ఉడ్, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభమే అదరగొట్టింది. ఓపెనర్లు జేసన్ రాయ్(49), జోస్ బట్లర్(28) జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. బట్లర్ అవుటైనా రాయ్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రాయ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో డేవిడ్ మలాన్(24), జానీ బెయిర్టో(26) లాంఛనం పూర్తి చేశారు. దీంతో మరో 27 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. కాగా.. భారత బౌలర్లతో వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x