Wednesday, January 22, 2025

క్రెడిట్ కార్డులతో కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా..?

డబ్బు సంపాదించాలంటే కష్టపడి చెమటోడ్చాలనేది పాత సామెత. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌గా ఆలోచిస్తే చాలు కోట్ల రూపాయలు
సంపాదించవచ్చని నిరూపించాడో వ్యక్తి. దానికోసం కేవలం క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించే అలవాటు ఉంటేచాలని రుజువు చేశాడు. క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌ వినియోగించి, వాటి ద్వారా రివార్డ్‌ పాయింట్స్‌ సంపాదించి కోట్లు గడించాడు.

సాధారణంగా ఆన్‌లైన్‌లో కానీ, మరెక్కడైనా కానీ ఏవైనా వస్తువులు కొనుగోలు చేసి క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే కొన్ని రివార్డ్ పాయింట్లు వస్తాయి. కొన్నిసార్లు వేలల్లో వస్తాయి ఈ రివార్డ్ పాయింట్లు. కానీ అమెరికాకు చెందిన కాన్‌స్టంటీన్ అనే భౌతిక శాస్త్రవేత్త ఇలా వచ్చే రివార్డు పాయింట్లతో కోటీశ్వరుడయ్యాడు. రివార్డు పాయింట్ల ద్వారా ఏకంగా రూ. 2.17 కోట్లు సంపాదించాడు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. కొనస్టాంటిన్ అనికీవ్‌ ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి క్రెడిక్ కార్డుల ద్వారా సంపాదించడమంటే మహా సరదా. 2009 నుంచి అతడు ఇదే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా అతడికి బాగా అలవాటైపోయింది. దాంతో మిలియన్ల డాలర్లు సంపాదించాడు.

టెక్నిక్ ఇదే:
కాన్‌స్టంటీన్ క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెద్ద ఎత్తున గిఫ్ట్ కార్డులు కొనేవాడు. గిఫ్ట్ కార్డు కొనడం.. ఆ తర్వాత దానిని డబ్బుగా మార్చుకునేవాడు. ఆ సొమ్మును బ్యాంకులో తన ఖాతాలో డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చిన సొమ్ము అతడికి మిగిలిపోయేది. ఓ 100 డాలర్ల గిఫ్ట్‌కార్డు కొంటే 5 శాతం చొప్పున 5 డాలర్లు రివార్డ్ పాయింట్లుగా వచ్చేది. గిఫ్ట్‌కార్డును నగదుగా మార్చుకోవాలంటే 6 డాలర్లు చెల్లించాలి. దీని ద్వారా 19 డాలర్లు మిగిలిపోయేవి. అలా ఏళ్లుగా డబ్బులు మిగుల్చుకోవడంతో ఇప్పటివరకు ఏకంగా 3 లక్షల డాలర్లు(దాదాపు 2.17 కోట్లు) సంపాదించాడు. అతడి సంపాదన ఒక్కసారిగా పెరగడంతో టాక్స్ అధికారులకు దృష్టి అతడిపై పడింది. విచారణ చేపట్టిన అధికారులు అతడి సంపాదన నిజమేనని తేలడంతో అక్రమాస్తుల కింద అనికీవ్‌కు నోటీసులు పంపారు.

కోర్టులో విచారణ సందర్భంగా కాన్‌స్టంటీన్ తన గిఫ్ట్‌కార్డుల విషయం మొత్తాన్ని చెప్పి.. ఆ గిఫ్ట్ కార్డులను కూడా తెచ్చి చూపించాడు. వాదనలు విన్న కోర్టు.. గిప్ట్ కార్డులు ఆస్తుల వంటివేనని, వచ్చిన క్రెడిట్ కార్డు రివార్డులకు పన్నులు ఉండబోవని కోర్టు పేర్కొంది. ఈ కేసు నుంచి రివార్డులకు లెక్కించబోమని పేర్కొంది. అయితే, గిఫ్ట్‌కార్డులను నగదుగా మార్చుకోవడమంటే ఆస్తిని తిరిగి విక్రయించడమేనని పేర్కొంది. కాబట్టి వాటికి పన్ను చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలిసిన వారంతా కాన్‌స్టంటీన్ తెలివికి ఫిదా అవుతున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x