Wednesday, January 29, 2025

‘6 అరటిపళ్ళు రూ.3వేలు.. ఓ కాఫీ ప్యాకెట్ రూ.7వేలు’

ఉత్తర కొరియా దేశంలో ఆహార సంక్షోభం దారుణస్థితికి చేరుకుంది. అక్కడి ప్రజలంతా ఆకలితో అల్లాడిపోతున్నారు. దీనికి తోడు అక్కడి నిత్యావసరాల ధరలు ప్రపంచమే నివ్వెరపోయే స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఓ చిన్న బ్లాక్ టీ ప్యాకెట్ ధర 70 డాలర్లు (5,167రూపాయలు). ఇక కాఫీ ప్యాకెట్ ధర అయితే వెయ్యి డాలర్లకు పైగానే(7,381 రూపాయలు) ఉంది. ఇక ఒక కిలో అరటిపండ్ల ధర 45 డాలర్లుగా ఉంది. అంటే ఇక్కడ 3300 రూపాయలన్నమాట. మహా అయితే కిలోకు ఒక 6-7 అరటిపండ్లు మాత్రమే వస్తాయి.

దేశంలో ఆహార కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారంటే ఆ దేశంలో పరిస్థితులు ఎంత దిగజారాయో వేరే చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా నిత్యావసర సరుకుల కొరత ఉంటే ధరలు అమాంతం పెరుగుతాయి. ఇప్పుడు ఉత్తర కొరియాలోనూ అదే జరుగుతోంది.

ఆహార కొరతను కారణాలివే:
ఉత్తర కొరియాలో ఈ స్థాయిలో ఆహార కొరత ఏర్పడటానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి ఆ దేశంపై ఉన్న ఆంక్షలు. రెండోది ఇటీవల వచ్చిన భారీ వరదలు.

ఆంక్షలు:
ఉత్తరకొరియా ఆహార నిల్వలన్నీ అత్యధికంగా చైనా ఆస్ట్రేలియల నుంచి దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. అయితే కరోనా కట్టడి నిమిత్తమై ఉత్తర కొరియా స్వీయ ఆంక్షలను విధించుకుంది. పక్క దేశాలతో సరిహద్దులను పూర్తిగా మూసేసింది. అలాగే కొన్ని దేశాలు కూడా ఉత్తర కొరియా నుంచి ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించడంతో సమస్య మరింత తీవ్రమైంది.

వరదలు:
ఉత్తర కొరియాలో ఇటీవల తీవ్రంగా వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల భారీ స్థాయిలో పంట నాశనమయింది. ఫలితంగా ఆ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోంది.

కాగా ఈ ఏడాది మొత్తం మీద ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం కూడా తన అంచనాను వెల్లడించింది. దాదాపు 8 లక్షల 60వేల టన్నుల ఆహార కొరతను ఉత్తర కొరియా ఎదుర్కొంటోందని స్పష్టం చేసింది. పరిస్థితులను గమనించిన కిమ్ జాంగ్ ఉన్ ఆహార కొరతను ఎదుర్కొనేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆహారోత్పత్తిని పెంచేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా ఇక్కడ రసాయన ఎరువులకు బదులుగా, సేంద్రీయ ఎరువుల తయారీ వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దిగుమతులపై పెట్టిన ఆంక్షల దృష్ట్యా ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుంది.

రైతుల మూత్రం కోసం ఆదేశం:
చైనాతో సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను ఉత్తర కొరియా నియంత్రించింది. దీంతో సేంద్రీయ ఎరువుల తయారీని వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం కంపోస్ట్ ఎరువులో కలిపేందుకు రైతులు నిత్యం రెండు లీటర్ల మూత్రాన్ని ఇవ్వాలని అధికారులు సూచించారట.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x