ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఏపీ మా) నూతన లోగోను,ఆర్టిస్టుల గుర్తింపు కార్డులను విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ శుక్రవారం ఉదయం లాసన్స్ బే కాలనీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.ఎం ప్రసాద్,అధ్యక్షుడు ఎం. కృష్ణకిషోర్ లు అసోసియేషన్ కార్యకలాపాలను ఎంపీ కు వివరించారు.కరోనా వలన కళాకారులకు సినిమాలు, కళ ప్రదర్శనలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తక్షణమే కళాకారుల ఆదుకోవాలని ఎంపీ ని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి కళాకారుల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విశాఖ రాజధాని కాబోతున్న నేపథ్యంలో కళాకారులకు మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. కళాకారుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళాకారులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.కళాకారులు అంటే తనకు ఎంతో అభిమానమని, వారికి అన్ని విధాల ప్రభుత్వం సాహాయ పడేలా కృషి చేస్తానన్నారు. ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ ఎం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందులో భాగంగా 13 జిల్లాలకు చెందిన కళాకారులకు గుర్తింపు కార్డులను త్వరలోనే అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్య నిర్వాహక కార్యదర్శులు సి.హెచ్.రమేష్ యాదవ్, పి.వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు రవితేజ, పి.వి.రమణ, ఎస్.ఎఫ్.ఎక్స్ ఫిల్మ్ స్టూడియో అధినేత పి.శ్యాం కుమార్.ఎం. సాయి సంతోష్ పట్నాయక్ పాల్గొన్నారు.