Tuesday, January 28, 2025

సందడిగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ‘పరంపర 2’ ప్రీ రిలీజ్ కార్యక్రమం

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా

దర్శకుడు అరిగెల విశ్వనాథ్ మాట్లాడుతూ… పరంపర 2 లో మరింత యాక్షన్, డ్రామాను చూస్తారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర పర్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో గోపీ లక్షణాలు ఏమాత్రం లేని వ్యక్తి నవీన్ చంద్ర. అతనితో పనిచేయడం సంతోషంగా ఉంది. రెండేళ్ల కిందట నుంచి ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ లో ఉన్నాం. ఫైనల్ గా ఇప్పుడు సెకండ్ సీజన్ తో మీ ముందుకు వస్తున్నాం. నవీన్ చంద్ర క్యారెక్టర్ మాత్రమే కాదు శరత్ కుమార్, జగపతిబాబు, రవివర్మ, ఆకాంక్ష సింగ్, దివి ..ఇలా వీరందరి క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ఆర్కా మీడియాకు బాహుబలి 2 ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో, పరంపర 2 కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలి. అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ… ఈ వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ చేశాను. ఒక నటుడికి కావాల్సింది సహ నటుల ప్రోత్సాహం. నవీన్ చంద్ర నుంచి నాకు ప్రతిసారీ అలాంటి ప్రోత్సాహం అందుతూనే ఉంది. అతనితో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు.

నటి బిగ్ బాస్ దివి మాట్లాడుతూ… నా క్యారెక్టర్ ఇందులో స్పెషల్ గా ఉంటుంది. వెబ్ సిరీస్ చివరలో నా పాత్ర ఇంపార్టెంట్స్ ఏంటో తెలుస్తుంది. బిగ్ బాస్ తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్న టైమ్ లో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి ఈ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అని చెప్పింది.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ… రచన అనే పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను నటించిన చిత్రాలు కొన్నే. అయినా నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఆర్కా మీడియాకు థాంక్స్. నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది. నటించకుండా నేనే రచన అనుకుని నటించాను. పరంపర 2 అంటే గోపీ, రచన మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది, వెబ్ సిరీస్ లో చూసి ఎంజాయ్ చేయండి. అని చెప్పింది.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… పరంపర సీజన్ 1 వెజ్ థాలి అయితే, పరంపర 2 నాన్ వెజ్ మీల్స్. మరింత డ్రామా, యాక్షన్, రివేంజ్ చూస్తారు. సీజన్ 2 స్ట్రీమింగ్ కు కొద్ది రోజులే ఉంది. కాబట్టి మొదటీ సీజన్ చూసేయండి, అప్పుడు మీకు సెకండ్ సీజన్ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ సీజన్ లో మీక ఏ అంశాలైతే మిస్ అయ్యాయి అనిపించాయో, వాటికి సీజన్ 2 లో సమాధానం దొరుకుతుంది. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x