Wednesday, January 22, 2025

‘మ‌ను చ‌రిత్ర’ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘మ‌ను చ‌రిత్ర’. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని కథానాయికలుగా నటిస్తున్నారు. భ‌ర‌త్ పెద‌గాని ఈ చిత్రంతో ద‌ర్శకునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే విడుదల తేది ప్రకటించనున్నారు నిర్మాతలు.

ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్సవ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని, ప్రగ‌తి శ్రీ‌వాత్సవ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌ అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్రసాద్‌, ప్రమోదిని, సంజ‌య్ స్వరూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్రదీప్‌.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x