Thursday, November 21, 2024

Yadgiri and Sons: యాద్గిరి అండ్ సన్స్‌ మూవీ రివ్యూ

టైటిల్‌: యాద్గిరి & సన్స్‌
నటీనటులు: అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
విడుదల తేదీ: 05-05-2023

భూమిపై నిజంగా జరిగిన సంఘటనలతో సినిమాలు తీయడం కొత్తేం కాదు. మర్డర్‌ మిస్టరీస్‌, ఇన్విస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌‌ తెలుగు తెరపై ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇలాంటి జోనర్‌‌కు మినిమమ్‌ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. అలాంటి జోనర్‌లో వచ్చిందే యాద్గిరి అండ్ సన్స్‌. మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన వాస్తవ సంఘటనతో తీసిన ఈ సినిమాపై టీజర్‌ మరియు ట్రైలర్‌లతో ఆడియెన్స్‌లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. అందులోనూ మేకర్స్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుందని, అది అందరూ ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలంటూ మేకర్స్ చెప్పడంతో.. ఇందులో ఏం చెప్పబోతున్నారో అనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయింది. మరి అందుకు తగ్గట్టే ఈ సినిమా ఉందా.. వారు చెప్పాలనుకున్న మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
హైదరాబాద్‌ సిటీలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో బ్రతికే ఆటోవాలా యాద్గిరి (జీవా). అతనికి ఇద్దరు కొడుకులు లక్ష్మణ్, వెంకట్‌. పెద్దకొడుకు లక్ష్మణ్‌ తాగుబోతు. చిన్నకొడుకు వెంకట్‌ (అనిరుధ్) కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టి ఇంటిని పోషిస్తూనే.. తన లవర్ స్వాతి (యశస్విని) బర్త్‌డేకి గిఫ్ట్‌ ఇచ్చే ప్లాన్‌లో ఉంటాడు. అది కాస్తా లక్ష్మణ్ కంట పడుతుంది. తాగుడు కోసం వెంకట్‌ డబ్బులు కాజేస్తాడు. అది తెలిసిన వెంకట్‌.. అన్న లక్ష్మణ్‌తో గొడవ పడతాడు. మాటా మాటా పెరిగి పోట్లాటకు దారితీస్తుంది. ఈ కొట్లాటలో లక్ష్మణ్‌కు వెంకట్‌ కొట్టిన దెబ్బ బలంగా తగిలి చనిపోతాడు. వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. లాయర్‌ రాజీవ్‌ కనకాల సాయంతో బెయిల్‌‌పై బయటపడతాడు. తండ్రి ఇంట్లోనుంచి వెళ్లగొడతాడు. అక్కడి నుంచి తన అన్న మరణానికి తాను కొట్టిన దెబ్బలు కారణం కాదని.. ఇంకేదో ఉందని వెతికే ప్రయత్నం చేస్తాడు. వెంకట్‌ తన అన్న చావుకు అసలు కారణం తెలుసుకున్నాడా..? అసలు మిస్టరీ ఏంటనేది తెలియాలంటే బిగ్‌స్క్రీన్‌‌పై ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు మర్డర్ మిస్టరీతో వచ్చాయి. ఇందులో మర్డర్‌ మిస్టరీ‌ని ఛేదించడంతో పాటు ఎంటర్‌టైన్‌‌మెంట్, అలాగే మిస్టరీతో పాటు ఓ మెసేజ్‌ను కూడా జోడించిన విధానం బాగుంది. కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినా.. ఇప్పుడున్న ప్రేక్షకులకి కథనంతో పాటు కొత్తదనం కూడా కావాలి. అలాగే సినిమాటిక్‌ లిబర్టీని కూడా కథకి అనుగుణంగా వాడుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి మిస్టరీ థ్రిల్లర్స్ ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తాయి. ఆడియెన్స్‌ని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. యాద్గిరి అండ్ సన్స్‌ విషయంలో బడ్జెట్‌ పరిధి పరిమితమని తెలిసిపోతూనే ఉంటుంది. అయినా తన పరిధిలో మర్డర్‌ మిస్టరీని చివరి వరకు ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకోసం మర్డర్‌ జరిగిందనేది తెలిస్తే.. డబ్బు కోసం మనుషుల్లో ఇంత కసాయితనం పెరిగిందా? అని అనిపిస్తుంది. టెలివిజన్ న్యూస్‌ చూసినపుడో, పేపర్స్‌ చదివినప్పుడో ఎన్నో సార్లు మనకు కలిగిన ఎమోషన్‌‌ను.. తెరమీద చూస్తున్నపుడు కూడా కలిగిస్తేనే ఆ సినిమా విజయవంతం అయినట్లు‌. అలా చూసుకుంటే ఈ యాద్గిరి అండ్ సన్స్‌ చాలా వరకు సక్సెస్‌ అయిందనే చెప్పుకోవాలి. దర్శకత్వ ప్రతిభ, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌, ఆర్టిస్ట్‌ల అభినయం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మర్డర్‌ మిస్టరీలకు ప్రధాన బలం. ఈ సినిమాకు ఉన్నంతలో ప్రతి టెక్నీషియన్ తమ సపోర్ట్‌ని అందించారు. అలాగే ఇలాంటి థ్రిల్లర్ విషయాలలో ప్రేక్షకులకు దొరకకూడదు. లాజిక్‌‌లు వెతికే ఛాన్స్ వారికి ఇవ్వకూడదు‌. ఆ విషయంలో ఈ సినిమా దొరికిపోతుంది. మర్డర్‌ ఎందుకు జరిగిందనేది తెలిసి.. చూస్తున్న ప్రేక్షకులు సైతం షాకయ్యేలా చేయడంలో దర్శకుడు తన ప్రతిభను కనబరిచాడు. సరైన, కాస్త పేరున్న ఆర్టిస్ట్‌లు కనుక ఈ సినిమాకి పడుంటే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేదీ చిత్రం. ఇలాంటివి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి కాబట్టి.. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాని చూడాల్సిన ఆవశ్యకత అయితే ఉందని చెప్పుకోవాలి. లాజిక్‌లు పక్కన పెడితే.. మంచి మెసేజ్ మాత్రం ఇందులో ఉంది.

ట్యాగ్‌లైన్: మంచి సందేశమిచ్చే మర్డర్ మిస్టరీ
రేటింగ్: 3/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x