కంటెంట్‌కు వెళ్లండిSkip to content
6, అక్టోబర్ 2026, మంగళవారంTuesday, 6 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

ఘనంగా జెమిని సురేష్ 'ఆత్మకథ' ఆడియో లాంచ్.. హనుమాన్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభంGemini Suresh's 'Aathmakatha' Audio Launched in Style, Unveiling New Label Hanuman Music

జెమిని సురేష్, రూప ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఆత్మకథ – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ' ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇదే వేదికపై కొత్త ఆడియో లేబుల్ 'హనుమాన్ మ్యూజిక్' ప్రారంభమైంది.The audio of 'Aathmakatha – An Untold Story', starring Gemini Suresh and Roopa and directed by Srinivas Gundreddy, was launched in Hyderabad, along with the new audio label Hanuman Music.

Cine Sarkar Desk
Share

జెమిని సురేష్, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆత్మకథ – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ’. వారాహి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోమేష్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలోనే కొత్త ఆడియో లేబుల్ ‘హనుమాన్ మ్యూజిక్’ కూడా ప్రారంభమైంది. ఈ లేబుల్ ద్వారా విడుదలైన తొలి ఆల్బమ్ ‘ఆత్మకథ’. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, రఘు కుంచె ఆడియోను ఆవిష్కరించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రిథమ్ స్టూడియోస్ ఇన్‌చార్జ్ కొల్లి రామకృష్ణ కూడా హాజరయ్యారు.

సినిమా కథ తనను బాగా ఆకట్టుకుందని ఆర్.పి. పట్నాయక్ చిత్ర బృందాన్ని అభినందించారు. చిన్న సినిమాలను, నిర్మాతలను ప్రోత్సహించాలనే హనుమాన్ మ్యూజిక్ ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించి, పరిశ్రమకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించామని హనుమాన్ మ్యూజిక్ ఎండీ అవినాష్ కూనపరెడ్డి తెలిపారు. తమ సినిమాతో లేబుల్‌ను ప్రారంభించినందుకు జెమిని సురేష్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

‘ఆత్మకథ’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: జెమిని సురేష్, రూప, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు

సాంకేతిక వర్గం:

  • సంగీతం: శ్రేయాన్ష్
  • ఛాయాగ్రహణం: గోపి
  • ఎడిటింగ్: రాఘవేంద్ర రెడ్డి
  • నిర్మాత: సోమేష్
  • బ్యానర్: వారాహి ఎంటర్‌టైన్‌మెంట్స్
  • రచన, దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి

‘Aathmakatha – An Untold Story’ stars Gemini Suresh and Roopa in the lead roles. Produced by Somesh under the Varahi Entertainments banner, the film is written and directed by Srinivas Gundreddy. Its audio launch was held in Hyderabad in the presence of film personalities.

The event also marked the launch of a new audio label, Hanuman Music, with ‘Aathmakatha’ as its first release. Renowned music directors RP Patnaik and Raghu Kunche unveiled the audio. Former Deputy Speaker Kona Raghupathi and Rhythm Studios in-charge Kolli Ramakrishna also attended.

RP Patnaik said he was impressed by the film’s story and congratulated the team, adding that he supports Hanuman Music’s effort to encourage small films and producers. Hanuman Music MD Avinash Kunapareddy said the company was started to encourage films and support the industry, and Gemini Suresh thanked him for launching the label with their film.

‘Aathmakatha’ is gearing up for release in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada.

Cast: Gemini Suresh, Roopa, 30 Years Industry Prithvi, Sammeta Gandhi, Shakalaka Shankar, Thagubothu Ramesh, Dhanraj, Naga Mahesh, Balagam Vijayalakshmi, Srinivas Naidu

Technical Crew:

  • Music: Shreyansh
  • Cinematography: Gopi
  • Editing: Raghavendra Reddy
  • Producer: Somesh
  • Banner: Varahi Entertainments
  • Writer & Director: Srinivas Gundreddy
Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema