Friday, April 4, 2025

‘డైమండ్ రాజా’ నుండి ‘ఆకాశమే నువ్వని’ పాట విడుదల

వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్సకత్వంలో తమటం కుమార్ రెడ్డి , బి క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘ఆకాశమే నువ్వని’ పాటని హీరో నిఖిల్ ముఖ్య అతిధిగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద అద్భుతంగా ఆలాపించారు. రాంబాబు గోశాల సాహిత్యం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగానిఖిల్ మాట్లాడుతూ.. నేను, వరుణ్ సందేశ్ వారం క్రితం ఒక పార్టీలోకలిశాం. ఒక పాట వినిపించాడు. అద్భుతంగా వుంది. ఎవరి సినిమా అని అడిగితే నాదే అన్నాడు. లాంచ్ ఎప్పుడు , ఎవరు లాంచ్ చేస్తున్నారని అడిగితే నువ్వే అన్నాడు. సిద్ శ్రీరామ్ , చిన్మయ పాపులర్ గాయకులు. అద్భుతంగా పాడారు. రాంబాబు చక్కగా రాశారు. ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. వరుణ్ చాలా బావున్నాడు. హిట్లు ఫ్లాపులు కామన్. ఒక్క హిట్టుతో మళ్ళీ కమ్ బ్యాక్ కావచ్చు. డైమండ్ రాజాతో వరుణ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలని కొరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నిఖిల్ ఈ పాట విన్నారు. అతనికి చాలా నచ్చింది. ఈ ఈవెంట్ కి వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్. నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే పాటలు తర్వాత ఈ పాట కూడా అంతే సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అచ్చు అద్భుతమైన పాట చేశారు. సిద్ శ్రీరామ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. నాకు ఫస్ట్ టైం పాడారు. చిన్మయి గారు కూడా అద్భుతంగా పాడారు. డైమండ్ రాజా చేయడానికి కారణం శ్రీనివాస్ గారు చెప్పిన కథ. చాలా బావుంది. కామెడీ చాలా రోజులుగా చేయలేదు. ఎవరైనా ఎప్పుడైనా సినిమాకి సుకుమార్ గారు కాల్ చేసి ఫెర్ఫార్మెన్స్ సూపరని చెప్పారు. అది మర్చిపోలేను. డైమండ్ రాజా ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా ఇది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేశారు. నిర్మాతలు కుమార్, క్రాంతి గారికి” కృతజ్ఞతలు తెలిపారు.

డాలీషా మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్ తో పని చేయడం ఆనందంగా వుంది, , శ్రీనివాస్ గారు చాలా మంచి కథని చేశారు సిద్ శ్రీరామ్, చిన్మయి పాడిన ఈ పాటసూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. డైమండ్ రాజా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీస్ అంతా హాయిగా చూడాల్సిన చిత్రమిది. సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి అని కోరారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, డాలీషా, నందిని రాయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, షకలక శంకర్, పృధ్వీరాజ్, ధనరాజ్, తాగుబోతు రమేష్ తదితరులు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x