Friday, November 1, 2024

‘భీమదేవరపల్లి బ్రాంచి’.. ప్రతి ఒక్కరినీ తమ గ్రామానికి తీసుకెళ్తుంది

‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఇది ఆర్గానిక్ గ్రామీణ చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను”Neorealism” జానర్లో నిర్మిస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి.. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది.

కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్& సాంగ్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్రారంభమయ్యాయి.

సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప, అంజి బాబు,రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి,
పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
AB CINEMASS & NIHAL PRODUCTIONS నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బేవర్స్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న
రమేశ్ చెప్పాల దర్శకుడు.
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.
నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి
కెమెరా: చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ
డిజైనర్: ధని ఏలే
ఆర్ట్: మోహన్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x