Wednesday, January 22, 2025

‘క్రేజీ అంకుల్స్’ టైటిల్ సాంగ్‌ వదిలిన అనిల్‌ రావిపూడి

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు..ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.. ఈ కామెడీ రైడ్ ఆగస్ట్‌లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రేజీ అంకుల్ టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు శ్రీ‌ధ‌ర్ రావు, ల‌క్ష్మ‌ణ‌రావు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో..

శ్రీముఖి మాట్లాడుతూ – ‘‘క్రేజీ అంకుల్స్‌’ సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్‌ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్‌ యాక్టర్స్‌ నటించారు. క్రేజీ కాంబినేషన్లు ఉన్నాయి. ఈ సినిమాలో నటీనటులందరు నా కెరీర్‌లో నాకు ఎక్కడో ఒక చోట పరిచయం ఉన్నవారే. మా అందరితో చాలా ఓపిగ్గా వర్క్‌ చేయించుకున్న దర్శకులు సత్తిబాబుగారికి, నిర్మాత అశోక్‌గారికి ధన్యవాదాలు. శ్రేయాస్‌ శ్రీనివాస్‌గారు భవిష్యత్‌లో ఇలాంటి ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌తో పాటుగా, పెద్ద పెద్ద సినిమాలను కూడా నిర్మించాలి’’ అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ – ‘‘ ఈ సినిమా సెట్స్‌లోనే నేను, మను, భరణి చాలా బాగా ఏంజాయ్‌ చేశాం. చిత్రబృందంలోని ప్రతిఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఇక నేను డ్యాన్స్‌ చేసి చాలా కాలం అయ్యింది. నా వయసు 54 సంవత్సరాలు. ఈ క్రేజీ అంకుల్స్‌ సాంగ్లో నటించడం హ్యాపీగా ఉంది. నా కెరీర్‌ బిగినింగ్‌లో రఘుకుంచెగారు నాకు డబ్బింగ్‌ చెప్పారు. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీ అయి పోయిన తర్వాత నేను చెప్పుకున్నాను. శ్రీముఖి భవిష్యత్‌లో పెద్ద ఆర్టిస్టు కావాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద సినిమాలు కూడా థియేటర్స్‌లో విడుదల అవుతున్న ఈ సమయంలో క్రేజీ అంకుల్స్‌ సినిమాను థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా నిర్మాతలకు
దన్యవాదాలు’’ అన్నారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ– ‘‘నాకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. కొంతమంది పెద్ద హీరోలతో కామెడీ సినిమాలు చేయలేం. అందుకనే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రేజీ అంకుల్స్‌ అనుకున్నాం. డార్లింగ్‌ సామీ కథతో ఈ సినిమా మొదలైంది. క్రేజీ అంకుల్సే కాదు.. భవిష్యత్‌లో ఇంకా ఎంటర్‌టైనింగ్‌ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తాం. త్వరలో గోల్డ్‌మ్యాన్‌ వస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె చాలా స్పీడ్‌గా వర్క్‌ చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ సినిమాకు పాండమిక్‌ టైమ్‌లో కూడా వర్క్‌ చేశాం. క్రేజీ అంకుల్స్‌ కోసం ఫిఫ్టీ ఇయర్స్‌ వారిపై ఓ సాంగ్‌ను తీశాం. ఈ సాంగ్‌కు సత్య మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. మనోగారి స్పాంటేనిటీ అందరికి తెలిసిందే. రాజా రవీంద్ర, భరణి కూడా బాగా చేశారు. ముగ్గురు అంకుల్స్, ముగ్గురు ఆంటీలు చేసిన కథే ఈ సినిమా. సినిమాలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. శ్రీముఖిలో ఉన్న స్పెషల్‌ ఎనర్జీ నాకు చాలాఇష్టం. భవిష్యత్‌లో తను మంచి నటిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మేం కోరుకున్నట్లుగా అవుట్‌పుట్‌ ఇచ్చిన సత్తిబాబుకు ధన్యవాదాలు’’ అన్నారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ – ‘‘రియల్‌లైఫ్‌ క్యారెక్టర్స్‌ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వుతూనే ఉంటారు. రాజారవీంద్ర, మను ,భరణి బాగా చేశారు. ఈ సినిమా విజయం సాధించి, చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. దగ్గరగా దూరంగా సినిమా తర్వాత నేను, కాసర్ల శ్యామ్‌ ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమాకు కలిసి పని చేశాం’’ అన్నారు.

చిత్ర నిర్మాత బొడ్డు అశోక్‌ మాట్లాడుతూ – ‘‘ నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన శ్రేయాస్‌ శ్రీనివాస్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దర్శకులు శ్రీవాస్‌ నాకు మంచి మిత్రులు. క్రేజీ అంకుల్స్‌ చిత్రం ప్రేక్షకులను తప్పకుండ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ సినిమా వినోదభరితంగా ఉంటూనే సందేశాత్మకంగా ఉంటుంది. ఈ సినిమా చివర్లో ఉన్న ట్విస్ట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అలాగే మా నుంచి మరో మూవీ ‘గోల్డ్‌మాన్‌’ రానుంది. ఈ చిత్రం కూడా బాగుంటుంది’’ అన్నారు.

గీత రచయిత కాసర్లశ్యామ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ ప్రాజెక్ట్‌ క్రేజీగానే మొదలైంది. శ్రేయాస్శ్రీనివాస్,రఘుకుంచె గార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. రాజారవీంద్రగారు నా కెరీర్‌ మొదట్నుంచే నన్ను ప్రొత్సహిస్తున్నారు. క్రేజీ అంకుల్స్‌లో తాజాగా విడుదలైన ఈ పాటను లిస్పిక బాగా పాడారు.
ఆమెకు అభినందనలు. రఘుకుంచెగారు ఓకల్స్‌ ఇచ్చారు“ అన్నారు

రచయిత డార్లింగ్‌ సామీ మాట్లాడుతూ – ‘క్రేజీఅంకుల్స్‌’ సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాలి’’ అన్నారు

గాయ‌త్రి భార్గ‌వి మాట్లాడుతూ – ‘‘అందరం కష్టపడి ఓ మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు ఓ మంచి ఎంటర్‌టైనర్‌ మూవీని చూడబోతున్నారు’’ అన్నారు

నిర్మాత శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పుడు మైక్‌లో మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు మా నిర్మాత బొడ్డు అశోక్‌గారి గురించి చెప్పాలనుకుని మైక్‌ పట్టుకున్నాను. ఆయన నాకు చాలా హెల్ప్‌ చేస్తున్నారు. చాలా బాగా ప్రొత్సహిస్తున్నారు. అశోక్‌గారు నాకు ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్నినింపుతుంది. వారే మా బలం. హెల్దీ కామెడీ సినిమాలు చేద్దామని క్రేజీ అంకుల్స్‌ స్టార్ట్‌ చేశాం. ఈ ప్రాజెక్ట్‌ 2020 దసరాకు ప్రారంభమైంది. 2021 జనవరిలో పూర్తయింది. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం. కాకపోతే పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో ‘క్రేజీ అంకుల్స్‌’ రిలీజ్‌ను వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వచ్చింది. ఇప్పుడు క్రేజీ అంకుల్స్‌ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. మా మరో మూవీ గోల్డ్‌మ్యాన్‌ను ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. కేవలం నాకు సాయపడాలనే ఉద్దేశంతో బిజీ ఆర్టిస్టులు, ప్రముఖ నటులు తమ పారితోషికాలను తగ్గించుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు ‘ఈ రోజుల్లో, రొమాన్స్‌’ ఇలా 8 సినిమాలు చేశాను. భవిష్యత్‌లో మరోస్థాయి పెద్ద సినిమాలను తీయాలనుకుంటున్నాను. ఈ సినిమా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు“ అన్నారు.

తారాగ‌ణం:
శ్రీ‌ముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, అదుర్స్ ర‌ఘు, గిరిధ‌ర్, హేమ‌, గాయ‌త్రి భార్గ‌వి, విజ‌య మూర్తి, వాజ్‌పాయ్‌, మ‌హేంధ్ర నాథ్‌, సింధూరి, మ‌ధూరి తదితరులు.
సాంకేతిక వ‌ర్గం:
క‌థ మాట‌లు: డార్లింగ్ స్వామి
సినిమాటోగ్ర‌ఫి: పి. బాల్‌రెడ్డి
సంగీతం: ర‌ఘు కుంచె
ఎడిట‌ర్‌: నాగేశ్వ‌ర రెడ్డి
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: ధ‌ని ఏలె
స్టిల్స్‌: పి ఎల్ గ‌ణ‌ప‌తి
ప్రొడ‌క్ష‌న్: అడ్డాల శ్రీ‌నివాస్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: ఆనంద్ తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సాయిబాబు వాసిరెడ్డి, గిరిధ‌ర్ మామిడిప‌ల్లి
ఫైనాన్స్ డైరెక్ట‌ర్: ర‌వి కొమ్మినేని
స‌మ‌ర్ప‌ణ‌: కిర‌ణ్ కె త‌ల‌సిల‌
నిర్మాత‌లు: గుడ్ ఫ్రెండ్స్ & బొడ్డు అశోక్
ద‌ర్శ‌క‌త్వం: ఇ. స‌త్తిబాబు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x