యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. నిన్న రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూట్ చేశారు. ఈరోజుతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా త్రినాధ రావు నక్కిన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ” నేను రెడీ ” ని సిద్ధం చేస్తున్నారు. హీరో హవిష్ కెరీర్ లో నేను రెడీ అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా ఉండబోతోంది. షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ తారాగణం ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధంగా వున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్టార్ కాస్ట్ వున్న సినిమా ‘నేను రెడీ’ కావడం విశేషం. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. నిజార్ షఫీ డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్






