కంటెంట్‌కు వెళ్లండిSkip to content
1, అక్టోబర్ 2026, గురువారంThursday, 1 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

13 ఏళ్ల 'మనం సైతం'.. అనాథలు, వృద్ధుల కోసం కాదంబరి కిరణ్ 'సపర్య'Manam Saitham at 13: Kadambari Kiran Launches 'Saparya' for Orphans and the Elderly

సినీ కార్మికులు, పేదలకు అండగా నిలుస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అనాథలు, ఒంటరి వృద్ధులు, నిరుపేదల కోసం 'సపర్య - వి కేర్ ఫర్ ది అన్‌కేర్డ్' కార్యక్రమాన్ని నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.As his Manam Saitham Foundation completes 13 years of service, actor Kadambari Kiran has announced 'Saparya - We Care for the Uncared', an initiative for orphans, elderly people living alone and the underprivileged.

Cine Sarkar Desk
Share

నటుడు కాదంబరి కిరణ్ స్థాపించిన ‘మనం సైతం’ ఫౌండేషన్ 13 ఏళ్లుగా సినీ కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారులు, నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. ఈ 13 ఏళ్ల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ‘సపర్య - వి కేర్ ఫర్ ది అన్‌కేర్డ్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.

అనాథ పిల్లలు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు, సమాజంలోని నిరుపేద వర్గాలకు అండగా నిలవడమే ‘సపర్య’ లక్ష్యం. ఇందులో భాగంగా ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమంతో పాటు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా ‘జనతా వైద్యం’ పేరుతో ఆసుపత్రిని నిర్మించనున్నారు.

సినీ కార్మికుల పిల్లల చదువుకు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి ఏటా ఐదుగురు విద్యార్థులకు హాస్టల్ వసతితో రెండేళ్ల ఉచిత నీట్ కోచింగ్, మరో ఐదుగురికి ఐఐటీ కోచింగ్ అందించనున్నారు.

ఈ ప్రాజెక్టుకు దాతలు, సినీ ప్రముఖులు ముందుకు వచ్చి సహకరించాలని, ’సపర్య’ను ఒక పెద్ద మానవతా ఉద్యమంగా మార్చాలని కాదంబరి కిరణ్ పిలుపునిచ్చారు.

Actor Kadambari Kiran’s Manam Saitham Foundation has spent 13 years providing financial help to film workers, ailing artists and the underprivileged. Marking that milestone at a media conference in Hyderabad, he announced a new initiative, ‘Saparya - We Care for the Uncared’.

Saparya aims to support orphaned children, elderly people living alone and underprivileged sections of society. As part of it, the foundation plans to build an orphanage, an old age home and an affordable healthcare facility named ‘Janatha Vaidyam’.

The initiative also focuses on the education of film workers’ children. Every year, five students will receive two years of free NEET coaching with hostel accommodation, and another five will receive IIT coaching.

Kadambari Kiran urged donors and film personalities to support the project and help grow Saparya into a larger humanitarian effort.

Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema