Monday, March 23, 2026

‘బ్రహ్మాస్త్రం’ చిత్రం నుండి కుంకుమల వీడియో సాంగ్ విడుదల

భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర”. ఈ సినిమా తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ కానుంది.

రాక్ స్టార్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు స్టార్లు కనిపించనున్నారు.

తాజాగా “బ్రహ్మాస్త్రం” చిత్ర యూనిట్ “కుంకుమల” వీడియో పాటను విడుదల చేసారు. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని “సిద్ శ్రీరామ్” ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు..తమిళ్..మలయాళం..కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ , అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , నాగార్జున, తదితరులు.

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
సంగీత దర్శకులు : ప్రీతమ్
గానం: సిద్ శ్రీరామ్
సాహిత్యం: చంద్రబోస్
సినిమాటోగ్రఫి: వి. మణికందన్, పంకజ్ కుమార్ , సందీప్ ఛటర్జీ, వికాస్ నౌలకా
ఎడిటర్: ప్రకాష్ కురుప్
ప్రొడక్షన్: స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్
పి.ఆర్.ఓ తెలుగు: ఏలూరు శ్రీను ,మేఘ శ్యామ్

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -