Sunday, March 22, 2026

సూప‌ర్‌స్టార్ ‘స‌ర్కారు వారి పాట’ అప్‌డేట్‌ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ఇటీవ‌ల దుబాయ్‌లో నెల‌రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకుంది.

ఆ షెడ్యూల్ త‌ర్వాత ఈ రోజు (ఏప్రిల్ 13) ఉగాది ప‌ర్వ‌దినం రోజున హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ కంటిన్యూగా జ‌రుగుతుంది. మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,

సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్,
పిఆర్ఓ: బి.ఎ.రాజు,
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -