Monday, March 23, 2026

డైరక్టర్ గా మారుతున్న మాయాబజార్ జగన్మోహన్…

మెగాఫోన్ పట్టనున్న మాయాబజార్ జగన్మోహన్…

మాయాబజార్ అనగానే… మనకి గుర్తొచ్చేది బ్లాక్ అండ్ వైట్ మూవీ. దానికి ఇప్పుడు రంగుల నగిషీలద్ది కలర్ సినిమాగా మార్చి… సరికొత్త రంగులమయంతో మాయాబజార్ ని మన ముందు ఆవిష్కరించారు జగన్మోహన్. అందుకే ఆయనకు మాయాబజార్ జగన్మోహన్ అని పేరు. ఆయన ఇప్పటికే ఈ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్దుడయ్యారు. ఎన్నో బ్లాక్ వైట్ చిత్రాలకు రంగులద్ది… కలర్ సినిమాలుగా మార్చేసిన ఆయన… ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతకాలం తెరవెనుక మాత్రమే వుండి సాంకేతిక సేవలందించిన ఆయన… ఇప్పుడు దర్శకత్వ శాఖలోకి అడుగుపెడుతున్నారు. టెంపుల్ మీడియా సంస్థ ద్వారా నిర్మించబోయే సినిమాకి దర్శకత్వంతో పాటు… రచన కూడా చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబరు 29న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ యతీష్, నందిని సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం షెడ్యూల్, నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -