Friday, November 1, 2024

‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ ట్రైలర్ రిలీజ్

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్ ప్రసన్న కుమార్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, ఇండస్రిలిస్ట్ జానకిరామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి.సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. ఫొటోగ్రఫీ చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ.. సినిమా చూశాను చాలా బాగుంది. దర్శకుడు వెంకట్ కథను చాలా బాగా నేరెట్ చేశాడు. నిర్మాత నాగేశ్వరావుకు సినిమానే ఊపిరి. తనకు హెల్త్ బాగాలేక లేకపోయినా సినిమా కొరకు తను పడే తపన నాకెంతో నచ్చింది. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి రావడం ద్వారా అనేక మందిని నటీనటులు టెక్నిషియన్స్ చిత్ర పరిశ్రమకు పరిచయ మవుతారని అన్నారు

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. మా ట్రైలర్ విడుదలకు వచ్చిన దర్శకులు బి. గోపాల్, సాగర్, ప్రసన్న కుమార్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు. నాకు ఆరోగ్యం బాగా లేదని తెలుసుకొని నాకు సపోర్ట్ గా నిలిచారు యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి గారు వారికీ నా ధన్యవాదాలు. దర్శకుడు వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాను. సంగీత దర్శకుడు సందీప్ ఇందులో ప్రతి సాంగ్ చాలా బాగుండేలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఆ తరువాత హుషారు ఫెమ్ తేజ్ కూరపాటి ని, హీరోయిన్ అఖిల ఆకర్షణలతో పాటు నటీ నటులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు.. అలాగే టెక్నిషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆశీర్వాదించాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన దర్శకులు బి. గోపాల్, సాగర్, ప్రసన్న కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు.. మా నాన్నకు హెల్త్ బాగా లేకపోయినా వెంకట్ చెప్పిన కథ నచ్చడతో నాతో ఈ సినిమా చేయించాడు. ఈ సినిమా ద్వారా నన్ను నిర్మాతగా పరిచయంచేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, జానకి గార్లకు ధన్యవాదములు. ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము. మా చిత్ర దర్శకుడు వెంకట్ గారు ఈ కథను చాలా బాగా తెరకెక్కించాడు. అలాగే జి. వి. ఆర్,కృష్ణం రాజు లు కూడా సపోర్ట్ చేశారు ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. ఈ సినిమాకు భవ్య దీప్తి రెడ్డి మంచి రిలీక్స్ ఇచ్చారు. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారు, బస్టాప్ కోటేశ్వరరావు, అనంత్ ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను చెప్పిన కథ నచ్చగానే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న నిర్మాతలకు ధన్యవాదములు. ఇది ఒక అందమైన రియాలిస్టిక్ ప్రేమ కథ. ఓసో లోని తత్త్వం, బుద్ధుని లోని సహనం, శ్రీ శ్రీ లోని రేవలిజం, వివేకానందుడి లోని గుణం వుండేలా తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ ను డైజైన్ చేయడం జరిగింది..వారితో పాటు ఈ చిత్రానికి పని చేసిన హీరో, హీరోయిన్స్ టెక్నిషియన్స్, నటులు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే యం.ఆర్. సి.వడ్ల పట్ల చౌదరి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర హీరోయిన్ అఖిల మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ కథలో హీరోయిన్ కు మంచి స్కోప్ ఉందనుకొని ఈ సినిమా చేశాను. సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

చిత్ర హీరో తేజ్ కూర‌పాటి మాట్లాడుతూ.. మా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. ఈ సినిమా 2 మంత్స్ లోనే షూట్ అయిపోయింది. మా నిర్మాతలు థి యేటర్స్ లలో రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ లో కోవిడ్ రావడంతో డిలే అయ్యింది. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. ఇంతమంది పెద్దలు వచ్చి బ్లెస్స్ చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. నిర్మాత ముల్లేటి నాగేశ్వ‌రావు కూతురు ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి వస్తున్నందుకు తనకు వెల్ కం చెపుతూ సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలకు ఈ కథ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఎంతో కష్టపడి నిర్మించిన ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి పెద్ద సినిమాగా నిలవాలని కోరుతున్నాను అన్నారు

న‌టీన‌టులు:
తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌రులు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x