హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వర్క్ చేసిన శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ అరిస్టులు హీరోలుగా బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, ఏర్పాటు సినిమాను నమ్మి మాతో ట్రావెల్ అయ్యారు.షూటింగ్ టైమ్ లో గాని షూటింగ్ తరువాత గానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు అందరూ మమ్మల్ని, చందు మొండేటి గారిని నమ్మి రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా ఆ టైమ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు. క్రియేటివ్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగష్టు 13 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. మేము విడుదల చేసిన “కార్తికేయ 2” ట్రైలర్ 1 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరినుండి కూడా మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మీ సినిమా ఎలా ఉన్నా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తాము అని కామెంట్స్ వస్తున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు.థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది.అందుకే నేను ఈ మధ్య థియేటర్,థియేటర్ అంటున్నాను. ఈ సినిమా కు మేము గ్రాఫికల్ షాట్స్ గాని, మంచి లొకేషన్స్ గానీ సెలెక్ట్ చేసుకొని గ్రీస్, గుజరాత్, కష్మీర్, ఇలా అనేక ప్రదేశాలలో తీశాము. ఇప్పుడే మా సినిమా ఓటిటి లో రాదు. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరూ థియేటర్స్ కు వచ్చి చూడండి. తప్పకుండా మీకు ఒక కొత్త అనుభూతిని పొందుతారు. టీజర్, ట్రైలర్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు. మేము 6 న ట్రైలర్ 2 ను రిలీజ్ చేస్తున్నాము అన్నారు.
చిత్ర నిర్మాత. టి. జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో, మంచి విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కార్తికేయ 2” సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ఈ చిత్ర మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది.ఈ సినిమా ద్వారా టి. జి. విశ్వ ప్రసాద్ తో కలసి అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.చందు గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిఖిల్, అనుపమ ఇలా అందరూ నటీ నటులు చాలా బాగా చేశారు. టెక్నిషియన్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకులు మాట్లాడుతూ. ఒక మంచి కాన్సెప్ట్ ను నమ్మి ఈ సినిమాకు మీడియా ప్రేక్షకుల ప్రోత్సాహం వుండాలి. ఆగష్టు 13 న వస్తున్న మా “కార్తికేయ 2” సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ సినిమా చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు చూసే సినిమా ఇది. ఈ నెల 13 న వస్తున్న ఈ “కార్తికేయ 2” అడ్వెంచర్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
నటుడు శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ..కార్తికేయ పార్ట్ 1 లో మిస్ అయినా పార్ట్ 2 లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఏదైనా మంచి చేద్దాం అనుకున్నపుడు మనకు మంచి జరుగుతుంది అనేదానికి ఉదాహరణ ఏంటంటే ఈ సినిమా కొరకు ద్వారకా నుండి హైదరాబాద్ వరకు దాదాపు నెలరోజులు ట్రావెల్ చేశాము. మాకు ప్రకృతి సహకరించింది అనుకోవచ్చు. ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. ఈ నెలా13 న వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. 2013 లో కార్తికేయ 1 ను అరకు, బొబ్బిలిపాడు ఏరియాలలో షూట్ చేశాము.అది నా కేరీర్ లో స్వీటెస్ట్ మెమరీ.ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత మా అందరికీ కేరీర్ లో ఎదుగుదలకు ఉపయోగపడిన సినిమా.8 సంవత్సరాల తర్వాత దాని సీక్వెల్ వస్తుందంటే ఎలా ఉంటుందో అనేది మొన్న ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఆ సినిమా కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని. ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు సత్య మాట్లాడుతూ.. కార్తికేయ పార్ట్ 1 లో నాది, ప్రవీణ్ ది మంచి క్యారెక్టర్స్. మేము ఆ సినిమాను చాలా ఎంజాయ్ చేశాము.. ఇప్పుడు వస్తున్న ఈ కార్తీకేయ 2 లో మంచి విజువల్స్ ఉన్నాయి.ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రం కంటే కూడా ఈ చిత్రం డబుల్ హిట్ అవ్వాలి అన్నారు.
నటుడు వైవా హర్ష మాట్లాడుతూ .. ఒక యాక్టర్ ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమా నుండి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు.నాకు కూడా కార్తికేయ 2 స్పిరిచువల్ జర్నీ. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు అని అన్నారు.
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. అందరూ సినిమాను చాలా ఇష్టంతో చేస్తారు. కానీ ఈ సినిమా ఇష్టం తో పాటు కష్టమైన సినిమా అనుకుంటున్నాను.కష్టపడే వారికి ఎప్పుడూ దేవుడు తోడుంటాడు అన్నట్టు ఈ సినిమాకు మాకు కృష్ణుడు తోడుంటాడని నమ్ముతున్నాను అన్నారు.
సహ నిర్మాత వివేక్ మాట్లాడుతూ.. ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్ప్లే-దర్శకత్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్లనిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య, ,పీపుల్స్ మీడియా అధినేత నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్,కాశ్మిర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, అనుపమ,కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, ఆర్ట్ డైరెక్టర్ సురేష్, ఆర్టిస్ట్ వెంకటేష్
ప్రెస్ మీట్ అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు
“కార్తికేయ” పార్ట్ 1 లో హీరోయిన్ గా స్వాతి రెడ్డి, ఇప్పుడు పార్ట్ 2 లో అనుపమ ను తీసుకోవడానికి గల కారణమేంటి?
దర్శకుడు చందు …. కార్తికేయ 2 లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు.అందుకే స్వాతిని తీసుకోలేదు. ఉదాహరణ కు ఇండియనా జోన్స్ చుడండి పార్ట్ 1 లో ఉన్న హీరోయిన్ పార్ట్ 4 లో వస్తుంది.ఆలా ఈ మూవీ స్టోరీ లో స్వాతి లేదు.
అర్జున్ సురవరం కు కూడా డేట్స్ మారుతూ వచ్చింది. చివరికి అది హిట్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రావడానికి కారణమేంటి ? గ్యాప్ వచ్చినా ఈ సినిమాకు కూడా డేట్స్ మారాయి. అది మీకు సెంటిమెంట్ అనుకుంటున్నారా?
హీరో నిఖిల్ ..నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ లో ఏ యాక్టర్ కు ఇలా ఉండదు.గండం వస్తే సక్సెస్ అవుతుంది సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు.అయితే నాకు కూడా ఇదినిజమేనోమో అనిపిస్తుంది. “ఎక్కడికి పోతావు చిన్నవాడా” కూడా ఆఫ్టర్ డిమాటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా అది మాకు బిగ్ హడల్. అర్జున్ సురవరం తరువాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం. ప్యాండమిక్ అందుకే సినిమా సినిమా చేయలేకపోయాం. ఆ సినిమా హిట్ తరువాత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని “కార్తికేయ 2” కొరకు వెయిట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది.
అనుపమ ఖేర్ ను తీసుకురావడా నికి కారణమేంటి?
దర్శకుడు చందు.. కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నంది. అక్కడి వారు అయితే బాగుంటుంది అకున్నాము. అయితే అభిషేక్ గారికి బాగా పరిచయం ఉండడంతో వారి ద్వారా అప్రోచ్ అయ్యి బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది.
ఓటిటి లో కాకుండా థియేటర్ కె వెళ్లి చూడాలనే ప్రామినెంట్స్ ఈ సినిమాలో ఏమున్నాయి?
హీరో నిఖిల్.. ఈ సినిమా డిజైనింగ్ లోనే థియేటర్ వచ్చి చూడాలని ప్లాన్ చేసుకున్నాము. కృష్ణుడు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా తీస్తే గ్రాండ్ వే లో అన్నమయ్య, దేవుళ్ళు వంటి సినిమాలు వచ్చేవి ఆ సినిమాలకు ఫ్యామిలీ మొత్తం థియేటర్ వచ్చి సినిమా చూసే వారు.. ఇప్పుడు ఎవరూ ఆలా రావడం లేదని మంచి భక్తి తో పాటు అడ్వెంచర్ తో పాటు థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. అందరూ థియేటర్ లో చుడండి కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు.
కార్తికేయ పార్ట్ 1లో యానిమిల్ హిప్నాటిజం చూయించారు. ఇందులో అది ఉంటుందా? అలాగే ఇందులో కృష్ణ తత్త్వం చూయించడానికి రీజన్ ఏంటి?
దర్శకుడు చందు..ఈ సినిమాలో అది ఉంటుందా అంటే అది కథలో ఫ్లో లో ఉంటుంది కాబట్టి అది థియేటర్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కృష్ణ తత్త్వం అనేది చెప్పాలని రాయలేదు.ఈ కథతో చెప్తే ఇంట్రెస్ట్ గా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మీరు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది లగే రహో మున్నాబాయి కంటే ముందు మున్నబాయ్ MBBS సినిమాలా క్యారెక్టర్స్ క్యారీ అవుతుంది కానీ కథ మాత్రం వేరు.
విశ్వప్రసాద్ ను చూజ్ చేసుకోవడానికి కారణ మేంటి?
హీరో నిఖిల్ : విశ్వప్రసాద్ గానీ, అభిషేక్ గారు గానీ డబ్బులు కోసం కార్తికేయ 2 తియ్యలేదు. కంటెంట్ ను నమ్మి సినిమాను లవ్ చేసి నిర్మాత గా వచ్చారు.
ఐదు లాంగ్వేజ్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీరు పాన్ ఇండియా స్టార్ అవ్వాలను కున్నారా లేక ఇది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారా?
హీరో నిఖిల్ : ఈ సినిమాను డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో మల్టీ లాంగ్వేజస్ లలో ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలని ఈ సినిమా తీశాము.ఈ సినిమాకు నేను హీరో ను కాదు. మేము ఎంచుకున్న పాయింట్ కృష్ణ తత్త్వం.మా సినిమా హీరో కృష్ణుడే అని మేము చాలా నమ్మాము. ఇప్పుడు కూడా కృష్ణుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అనుకుంటున్నాము. ఈ కథ యూనివర్సల్.స్విజ్జర్లాండ్ నుండి ఇస్కాన్ వారున్నారు. అంటార్కీటికా లో కృష్ణున్ని పూజిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప దేవుణ్ణి సినిమాగా తీసినప్పుడు అన్ని భాషల్లో ఉండాలని తీశాము.ఇస్కాన్ వారు మమ్మల్ని మధురకు పిలిచారు. మేమంతా వెళ్ళాము. అది మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంతే తప్ప నేను పాన్ ఇండియా స్టార్ కావాలని మాత్రం కాదు.
మీరు చేయబోయే సినిమాలు 4,5 లాంగ్వేజ్ లలో ఉంటాయా ?
హీరో నిఖిల్ .ఒక వేళ నా సినిమాలకు డిమాండ్ ఉంటే అవ్వచ్చు. ప్రతి సినిమా అవుతుంది అని చెప్పలేను. కొన్ని సార్లు రీజనల్ ఫిల్మ్స్ చేస్తాము. ఇప్పుడు లేను స్పై ఫిలిం చేస్తున్నాను..రా ఏజెంట్ సినిమాను ఇండియా మొత్తం చూస్తారు అనుకున్నప్పుడు అవి వర్క్ అవుట్ అవుతాయి
ఈ సినిమకు సీక్వెల్ ఉంటుందా..?
దర్శకుడు చందు .. ఇండియన జోన్స్ లా భారతీయ కల్చర్ తో కొత్త కొత్త అడవెంచర్స్ కాన్సెప్ట్ తో స్టోరీస్ వస్తుంటాయి.
ఈ సినిమాను ప్రస్తుతం ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు?
నిర్మాత అభిషేక్. అగర్వాల్.. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం లో రిలీజ్ చేస్తున్నాము.
లాస్ట్ ఇయర్ లో వై యస్ ఆర్ కాంగ్రెస్ (వై.కా.పా) కు సపోర్ట్ చేశారు.. ఇప్పుడు కూడా మీరుbవై.కా.పా లో వున్నారా?
హీరో నిఖిల్.. నాకు పార్టీ పాలిటిక్స్ అంటూ ఏమీ లేవు.. నేను ఎప్పుడూ యాక్టర్ నే.. అయితే అప్పుడు నాకు తెలిసిన వారు పోటీ చేయడంతో ప్రచారం చేశాను. అంతే కాదు అంతకుముందు కూడా నాకు తెలిసిన వారు పోటీ చేస్తే నేను తెలుగుదేశం, జనసేన లకు కూడా ప్రచారం చేశాను తప్ప నేను సినిమానే ప్రపంచం.
భాగవతం ను కాన్సెప్ట్ తీసుకువడానికి కారణమేంటి?
దర్శకుడు చందు .. కృష్ణుడు కథ యూనివర్షల్. అయన గురించి చాలా మందికి చాలా తెలియవు. ఇలాంటి మోడరన్ టైమ్ లో అయన గొప్ప తనం గురించి ఇప్పటి తరం యూత్ కు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాము