Thursday, November 21, 2024

‘గాడ్ ఫాదర్’ ని ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేమిస్తారు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ ‌లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ… అందరికీ దసరా శుభాకాంక్షలు. అనంతపురంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి వర్షంతో అంతరాయం ఏర్పడింది. అంత వర్షంలో అందరినీ ఉద్దేశించి మాట్లాడి అందరిలో సంతోషం నింపగలిగానని భావిస్తున్నాను. ఆ రోజు సినిమాకి పని చేసిన అందరి గురించీ మాట్లాడే అవకాశం రాలేదు. అందుకే ప్రత్యేకంగా ఈ రోజు ఈ సమవేశం ఏర్పాటు చేయడం ఆనందంగా వుంది. ఇంత ఇమేజ్ వుండి కూడా చాలా సింపుల్ గా ఉంటానని చాలా మంది అంటుంటారు. నాది నేను అనే ఆలోచన నా జీవితంలో ఎప్పుడూ రాదు. ఒక శిల్పం అందంగా ఉందంటే దాని కారణం ఆ శిల్పం కాదు. ఆ శిల్పం వెనుక చాలా మంది కష్టం వుంటుంది. చిరంజీవి అనే శిల్పం నా సొంతం కాదు. ఎంతో మంది కృషి, వారి గొప్పదనం వలన ఈ ఇమేజ్ వుంది. ఇది నాది అనుకుంటే అది అమాయకత్వమే. అందుకే దాన్ని హృదయంలో ఉంచుకున్నాను తప్ప మైండ్ కి ఎక్కించుకోలేదు. సింపుల్ గా ఉండటానికి ఇదే కారణం అని భావిస్తాను. ఈ సింప్లిసిటీ, ప్రేమ వాత్సల్యమే మరింత దూరం ప్రయాణించడానికి దోహదపడుతుందని అనుకుంటాను. వైవిధ్యంగా ఏదైనా చేయలనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో వుంటుంది. చరణ్ బాబు నా ఆలోచనలని నిరంతరం పరిశీలిస్తుంటారు. లూసిఫర్ సినిమా గురించి చరణ్ చెప్పినపుడు నిజంగా వైవిధ్యమైన సినిమా మనంచేయాల్సిన సినిమా అనిపించింది. అయితే లూసిఫర్ చూసినప్పుడు ఎక్కడో చిన్న వెలితి వుండేది. దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు ఎలా మార్చాలని ఆలోచించి.. సత్యానంద్, మోహన్ రాజా చేసిన మార్పుల తోటి ఒక తృప్తి కలిగింది. ఈ సినిమా చూస్తున్నపుడు పాటలు, హీరోయిన్ లేదనే ఆలోచనే రాదు. కేవలం క్యారెక్టర్ ని ఫాలో అవుతాం తప్పితే మరో ఆలోచన రానివ్వకుండా అద్భుతంగా డిజైన్ చేశారు మోహన్ రాజా. కథనం ని మాంచి బిగింపుతో నడిపారు. ‘గాడ్ ఫాదర్’ ని ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేమిస్తారు. మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మాటల రచయిత లక్ష్మీ భూపాల, డీవోపీ నిరవ్ షా, ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ , ఆర్ట్ డైరెక్టర్ , సురేష్ అందరూ మనసుపెట్టి ప్రేమించి చేశారు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తమన్ రేయింబవళ్ళు పని చేశారు. అనసూయాతో పాటు మిగతా నటీనటులందరికీ కృతజ్ఞతలు. విజయదశమికి ఈ సినిమాని గొప్ప విజయం సాధించాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ప్రేమించి గొప్ప విజయం ఇవ్వాలి” అని కోరుకున్నారు.

దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. నేను తమిళనాడులో పుట్టినా దర్శకుడిగా పుట్టింది మాత్రం తెలుగులోనే. ఇప్పుడు నా పదో సినిమాగా చిరంజీవి గారి గాడ్ ఫాదర్ తో రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం నా పేరుని మొదట సూచించిన నిర్మాత ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. నాకు ఐదేళ్ళు వున్నపుడు నేను చూసిన హీరో చిరంజీవి గారు. ఆయన ఇమేజ్ కళ్ళ నుండి ఎప్పటికీ పోదు. లూసిఫర్ సినిమాకి నేను పెద్ద అభిమానిని. అందులో వున్న బలాన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చాను. గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టింది తమన్, ఈ సినిమాకి తమన్ సంగీతం ఆరో ప్రాణం. డీవోపీ నిరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్ సురేష్, ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ , సత్యానంద్ , డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల అందరం కలసి ఒక మంచి టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. లక్ష్మీ భూపాల అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఇంటర్వెల్ లో ఒక సీన్ వుంది. థియేటర్ బద్దలౌతుంది. చిరంజీవి గారు కంటి చూపుతో గ్రేట్ యాక్షన్ చేశారు. సత్యదేవ్ పాత్ర అద్భుతంగా పండింది. నయనతార అద్భుతమైన పాత్ర చేశారు. మురళి శర్మ, సునీల్ , షఫీ, సముద్రఖని, అనసూయ అందరి పాత్రలు అద్భుతంగా వుంటాయి. నా డైరెక్షన్ టీంకు కృతజ్ఞతలు. చిరంజీవి గారిపై వున్న ప్రేమని ఈ సినిమాతో చూపించాను. ఇది మామూలు ప్రేమ కాదు. సినిమా బావుంటే ప్రేక్షకులు ఇంకా గొప్ప ప్రేమని చూపించాలని. ఇండస్ట్రీ కనీ ఎరుగని హిట్ ని గాడ్ ఫాదర్ కి ఇవ్వాలి. తెలుగు ని ఇండియా మ్యాప్ కి చూపించినది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మనందరికీ ఒక ఐడెంటిటి. ఈ సినిమాకి పని చేసిన అందరూ చిరంజీవి గారిపై ప్రేమతో చేశారు. ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రేమ కురిపించాలి” అని కోరారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. అన్నయ్య అంటే చిన్నప్పటి నుండి ఇష్టం ప్రేమ. ఆయనపై వున్న ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చాను. ఆయనతో కలసి నటించడం ఒక కల నేరవేరినట్లయింది. దర్శకుడు మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసినతీరు అద్భుతం. నిర్మాతలు ఆర్ బి చౌదరీ, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు నా థాంక్స్. గాడ్ ఫాదర్ విజయదశమి రోజు తప్పకుండా పెద్ద విజయం అందుకుంటుంది”అన్నారు

నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలానే వుంటాను. ఆయనతో గొప్ప సాన్నిహిత్యం వుంది. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో ఓసారి చరణ్ బాబు ఫోన్‌ చేసి.. ‘‘లూసిఫర్‌’ సినిమా నాన్నకు బాగా నచ్చింది. కుదిరితే మీరు హక్కులు కొనుగోలు చేయండి’’ అని చెప్పారు. చరణ్‌ బాబు చెప్పడంతో మేము హక్కులు కొనుగోలు చేశాం. అలా చిరంజీవి గారి చిత్రానికి నన్ను నిర్మాతను చేసింది చరణ్ బాబే. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి దీన్ని తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ మా బ్యానర్ లో చేయడం మేము ఎన్నడూ ఊహించని విషయం. ఇది చరణ్, చిరంజీవి గారి వలనే సాధ్యమైయింది ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఓ పండుగలా వుంటుంది. అభిమానులు తప్పకుండా విజిల్స్‌ వేస్తారు. గాడ్ ఫాదర్ అభిమానుల అంచనాల అందుకుంటుంది” అన్నారు

నిర్మాత ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ చిరంజీవి గారితో కలిసి మొదటిసారి వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సల్మాన్‌కు ధన్యవాదాలు. చిరు-చరణ్‌ వల్లే ఇది సాధ్యమైయింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం” అన్నారు.

రచయిత సత్యానంద్‌ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవితో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన నిరంతరం కష్టపడి పనిచేస్తుంటారు. కథ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు, ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటారు ‘లూసిఫర్‌’ రీమేక్‌ అనుకున్నప్పుడు ఏదో చిన్న వెలితి. కానీ మోహన్‌రాజా చిన్న మార్పు చెప్పారు. అది మాకెంతో నచ్చేసింది. ఆ మార్పు వల్లే ఈ సినిమా చేయాలని అందరూ నిర్ణయించుకున్నాం. తెలుగు ప్రేక్షకులు అభిరుచి తగ్గట్టు మోహన్ రాజా మార్పులు చేశారు. యూనిట్ అంతా గొప్పగా పని చేసింది. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం చరణ్ , చిరంజీవి గారి వలన సాధ్యమైయింది. ఈ సినిమా ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది” అన్నారు.

మాటల రచయిత లక్ష్మీ భూపాల మాట్లాడుతూ .. నాకు చిరంజీవి గారంటే పిచ్చి. ఆయన సినిమాకి మాటలు రాయడం అదృష్టం వరం. ఆయన సెట్ లో వున్న ప్రతి రోజు నేను సెట్ లో వున్నాను. నేను రాసిన మాటని ఆయన పలకడం మాటలకందని అనుభూతి. మోహన్ రాజా ఈ సినిమాని అద్భుతంగా తీశారు. నిర్మాతలకు, సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు,

రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్ బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, షఫీ,దివి, సమ్మెట గాంధీ, హరి, మహేష్, శ్రీనివాస్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x