Saturday, February 28, 2026

మార్చి 1న ‘రాకాస’ టీజర్ విడుదల

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.

‘రాకాస’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. ‘రాకాస’ గ్లింప్స్‌కి అయితే నెక్ట్స్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, అనుదీప్ దేవ్ ఆర్ఆర్, రాజు ఎదురోలు విజువల్స్‌తో చేసిన మ్యాజిక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఓవర్సీస్ రిలీజ్ కోసం టీం చేసిన ప్రమోషన్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి. ఓవర్సీస్‌లో ఈ మూవీని అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను వదిలారు. మార్చి 1న టీజర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే కథ ఎలా ఉండబోతోంది? సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్నది అర్థమైపోతోంది. పోస్టర్‌లో సంగీత్ శోభన్‌ను చూపించిన తీరు, ఓ వైపు పంట పొలాలు, పచ్చటి పైరుతో ప్రశాంతమైన వాతావరణం, మరో వైపు మంటలు, ఏం జరుగుతోందో తెలియని గందరగోళంలో ఉన్న మనుషుల్ని చూపించారు.

ఇలా పోస్టర్‌లోనే సినిమాలో ఉండే పలు లేయర్లను టచ్ చేశారు. ఇక ఈ టీజర్ వచ్చిన తరువాత సినిమాపై ఇంకా ఏ రేంజ్‌లో అంచనాలు పెరుగుతాయో చూడాలి. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించగా.. రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫర్‌గా పని చేశారు.

న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (#90s‌) త‌దిత‌రుల.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -