దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.
అందరికీ దసరా శుభాకాంక్షలు అందిస్తూ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు నిర్మతాలు. షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో సంతోష్, ఫారియా బ్రీఫ్‌కేస్ పై కూర్చుని లవ్లీగా కనిపించారు.
ఇటివలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రొమాన్స్, సస్పెన్స్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్ భరోసా ఇచ్చింది. నెల్లూరు సుదర్శన్ ఈ సినిమాలో హిలేరియస్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్