Wednesday, January 22, 2025

ఘోస్ట్ మూవీ ఫస్ట్ పోస్టర్ విడుదల

కన్నడ ప్రజలు ఎంతో అభిమానించే స్టార్ హీరో, Karunada Chakravarthy Dr శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’. అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రముఖ రాజకీయ నాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘ఘోస్ట్’ చిత్రం ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. కన్నడ లో ఇలాంటి తరహా చిత్రం వచ్చి చాల కలం అవడం శివరాజ్ కుమార్ ని ఈ చిత్రం చేసేలా ఇన్స్పైర్ చేసింది. ఈ చిత్ర క్లైమాక్స్, ఎంతో కొత్త తరహాలో సాగే స్క్రీన్ ప్లే ఆయనకీ ఎంతగానో నచ్చాయి. ఈ కథలో మెయిన్ థీమ్ భాషలకి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు.

కింగ్ అఫ్ అల్ మాసెస్ Dr శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా, నేడు (జులై 12) బాదుషా కిచ్చా సుదీప ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి శివరాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ డిజైన్ చిత్రం మీద ఆసక్తి మరింత పెంచేలా ఉంది. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ ఇది యాక్షన్ చిత్రం అని సూచిస్తోంది. అలాగే రివాల్వర్ కార్ కలిపి చేసిన డిజైన్ ఇది హైస్ట్ ఫిలిం అని హింట్ ఇస్తోంది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్… వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ చాలా బాగుంది. ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ చిత్రం మీద అంచనాలు పెంచడంతో పాటు ఇది ఏ తరహా చిత్రమో ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది.

‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కన్నడలో బ్లాక్ బస్టర్స్ అయిన తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం ‘ఘోస్ట్’ కి డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ ఐరావత, హతవాది, మణ్ణిన ధోని, అసుర, వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బిగ్ స్కెల్ లో నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఆగస్ట్ చివరి వారంలో ‘ఘోస్ట్’ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ : సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ : బిఏ రాజు’స్ టీం

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x