Monday, March 23, 2026

టాప్ గాయ‌కుల‌తో ‘స్వర మాన్‌సూన్ మ్యూజికల్ మస్తీ’.. ఎప్పుడంటే?

ఈ నెల 23న వి కె ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో హైద‌రాబాద్‌లోని టాప్ గాయ‌కుల‌తో స్వర మాన్ సూన్ మస్తీ ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మం శిల్పకళావేదికలో….

ఐదు గురు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగీతా కార్య‌క్ర‌మాన్ని వి కె ఎంటర్టైన్మెంట్ సంస్థ‌ నిర్వ‌హించ‌నున్నాయి. కొవిడ్ నేప‌థ్యంలో దాదాపు సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు అతి పెద్ద వేదిక కానుంది. స్వర మాన్ సూన్ మ్యూజికల్ మస్తీ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు వస్తుంది. ఈ నెల 23న టాప్ సింగ‌ర్స్, మ్యుజీషియ‌న్‌లతో క‌లిసి శిల్పకళావేదికలో సిద్దమైనది.

ఈ సంద‌ర్భంగా వి కె ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు వినయ కుమార్ మరియు తేజస్విని మాట్లాడుతూ..
వి కె ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో స్వర మాన్ సూన్ మ్యూజికల్ మస్తీ తో మన టాలీవుడ్ టాప్ సింగర్స్ అయిన గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజి, సింహ, దామని మరియు అరుణ్ కౌండిన్య తో హైదరాబాద్ లోని జులై 23న శిల్పకళావేదికలో ఈ మ్యూజిక్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజిక్ మస్తీ కచేరి మ్యూజిక్ ప్రియులు బాగా ఎంజాయ్ చేస్తాము అని భావిస్తున్నము. ఏ షో టికెట్స్ బుక్ మై షో లో ఉన్నాయి అని తెలిపారు.

శనివారం నాడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని సంస్థ కార్యక్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజి, దామని, సింహ, అరుణ్ కాయండిన్య మరియు తేజస్విని, వినయ కుమార్ కలిసి పోస్టర్ ను మరియు టికెట్ ని ప్రారంభించారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -