Sunday, March 22, 2026

అందం కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నారు: ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ కాజల్‌

డెర్మా 360 క్లినిక్‌ ప్రారంభోత్సవంలో మోడల్స్‌తో కలిసి బిగ్‌బాస్‌ ఫేమ్‌ కాజల్, ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ వైష్ణవి పాల్గొన్నారు. కరోనా తర్వాత మహిళలు, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చర్మ సౌందర్యంపై శ్రద్ధవహిస్తున్నారని బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్‌జే కాజల్‌ అన్నారు. సోమవారం కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మా 360 స్కిన్‌ అండ్‌ లేజర్‌ క్లినిక్‌ను ఆమె ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ వైష్ణవితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ కాజల్‌ మాట్లాడుతూ.. వర్క్‌ ఫ్రం హోమ్ కాన్సెప్ట్‌ వల్ల చాలా మంది సూర్యరశ్మికి నోచుకోకపోవడం వల్ల జుట్టు ఊడిపోవడం, చర్మంలో వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని.. వారందరికీ నగరంలో ఇలాంటి అత్యాధునిక పరిజ్ఞానంతో వస్తున్న క్లినిక్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ క్లినిక్‌లో సుమారు 25 రకాల చికిత్సలు అందిస్తున్నట్లు డాక్టర్‌ శిరీష యనగల్ల అన్నారు. ఈ కార్యక్రమంలో సూరజ్‌ ఉప్పలపాటితో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -