మీ పేరుమీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో మీకు తెలుసా..? లేకపోతే మీ పేరు మీద ఎవరైనా నకిలీ సిమ్ కార్డులు వాడుతున్నారేమో అనే భయం కలుగుతోందా..? అలా ఎవరైనా మీ ప్రూఫ్ మీద తీసుకున్న సిమ్ కార్డులు వాడుతున్నారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.
నకిలీ సిమ్ కార్డులతో జరిగే మోసాలు, క్రైం నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడానికి టెలికాం శాఖ ఒక పోర్టల్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అదే.. టెలికం ఎనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ పోర్టల్. క్లుప్తంగా టఫ్‌కాప్. మీకు తెలియకుండా ఎన్ని నంబర్లు మీ పేరుపై వాడుకలో ఉన్నాయో ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కాదు వాటిని రద్దు కూడా చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుంది.
వెబ్ సైట్ ఇలా వాడండి:
తొలుత https://www.tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. ప్రస్తుతం మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ నంబరును ఇవ్వాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. అంతే.. మీ పేరుతో ఉన్న ఫోన్ నంబర్లు(సిమ్‌లు) ఆ నంబరుకు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. మీకు అవసరం లేని.. మీకు తెలియకుండా వాడుకలో ఉన్న నంబర్లను అదే పోర్టల్‌లో నమోదు చేస్తే.. టెలికాం శాఖ వాటిని పని చేయకుండా బ్లాక్ చేస్తుంది.
ఇలా మీ ప్రైవసీని కాపాడుకుంటూ అనవసరమైన మోసాలు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చన్నమాట. మరి ఇంకెందుకాలస్యం. వెంటనే చెక్ చేయండి.