చైనా కంపెనీలకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షాక్ ఇచ్చింది. తప్పుడు రివ్యూలతో వినియోగదారులను మోసం చేస్తున్న సదరు బ్రాండ్ లపై బ్యాన్ విధించింది. మొత్తం మూడు చైనీస్ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అమెజాన్ ఈ నిషేధాస్త్రం సంధించింది. చైనాలోని షెన్ జెన్ ఆధారిత ఎలక్ట్రానిక్ కంపెనీ సన్ వాలీ తయారు చేసిన రావ్ పవర్ బ్యాంకులు, టాట్రోనిక్స్ ఇయర్ ఫోన్స్, వావా కెమెరాల అమ్మకాలపై జూన్ 16న అమెజాన్ నిషేధంని విధించింది.
చైనా బ్రాండ్లకు అనుకూలంగా రివ్యూలు రాయించడమే కాకుండా.. అలా రాసిన వినియోగదారులకు చైనా వ్యాపారులు గిఫ్ట్ కార్డులు అందిస్తున్నారని అమెజాన్ గుర్తించింది. దీంతో తమ రివ్యూ వ్యవస్థను చైనా వ్యాపారులు దుర్వినియోగం చేశారని, అందువల్ల ఆయా కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను 2020 నుంచి అమెజాన్ విక్రయించడం మొదలు పెటింది. అయితే నకిలీ కస్టమర్ రివ్యూలతో నిబంధనలను ఉల్లంఘించినందున తాము చైనా బ్రాండ్లపై నిషేధం విధించామని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ నిషేదాస్త్రంతో తక్న ఆన్‌లైన్ మార్కెట్ నుంచి చైనాకు చెందిన కొన్ని అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాయమయ్యాయి.