Sunday, March 22, 2026

సాగర గర్భంలో దావానలం.. నిప్పులు వెదజల్లి..

అది అట్లాంటిక్ మహాసముద్రం. ప్రశాంతంగా ఉండే సముద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎటుచూసినా నీళ్లే.. కానీ మధ్యలో మాత్రం అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి. సముద్రానికే నిప్పంటుకుందా అని అనిపించే ఆ ఆశ్చర్యకర దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడి సముద్రంలో ఆ నిప్పుల ఊటను నిలువరించేందుకు చుట్టూ పెద్ద పెద్ద నౌకలు చేరి ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. నమ్మశక్యం కానీ ఈ దృశ్యాలు మెక్సికో యూకటాన్ పెనిన్సులా తీరానికి కొన్ని నాటికళ్ మైళ్ల దూరంలో ఏర్పడ్డాయి.

సముద్రంలోని పెమెక్స్‌ ఆయిల్‌ రిగ్గింగ్‌ సంస్థకు చెందిన పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ఈ ఘటన జరిగింది. సముద్రం లోపల రిగ్గింగ్‌ చేసి, అంతర్భాగంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా ముడిచమురును బయటకు తీసుకొస్తారు. తాజాగా సముద్రం మధ్యలో పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ముడి చమురు ఒక్కసారిగా లీకైంది. అయితే చములు లీకైనా.. మంటలు ఎలా వచ్చాయనే విషయం మాత్రం అంతుపట్టకుండా ఉంది. విషయం తెలుసుకున్న పెమెక్స్‌ సంస్థ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని దాదాపు 5 గంటలపాటు కష్టపడి మంటలు అదుపు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కష్టపడితే.. 10.30 గంటలకు మంటలు అదుపులోకి తీసుకురావడంలో సంస్థ ఉద్యోగులు సక్సెస్ అయ్యారు.

దీనిపై మెక్సికో దేశ ప్రభుత్వ చమురు సంస్థ పెమెక్స్ ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన మంటలను దాదాపు 6 గంటలపాటు కష్టపడి ఆర్పినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానీ, ప్రాణనష్టం గానీ కలగలేదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన వెనుక కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -