Friday, November 1, 2024

ఆత్మానందమయి అమ్మ ఆధ్వర్యంలో ఉచిత యోగ మెడిటేషన్

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారు స్వయంగా అనుగ్రహిస్తున్న సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమాన్ని ఆదివారం నాడు శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలనుంచి చాలా మంది భక్తులకు పాల్గొన్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్. సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ.

పూజ్యశ్రీ అత్మానందమయి అమ్మగారు సుషుమ్న క్రియా యోగ సాధనకు సంబంధించిన అనేక సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలుగజేసే చాలా ప్రభావంతమైన ప్రక్రియ ఈ సాధన.

సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక స్వస్థతను సాధించవచ్చు. సుషుమ్న క్రియా యోగ అంతర్ చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను, అందించటంతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది పలుకుతుంది. ఒత్తిడిని నివారించి, సామర్థ్యాన్ని, నేర్పును పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంతో సులభంగా సాధన చేయగల మహత్తర ప్రక్రియ ఇది.
ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ఈ కార్యక్రమానికి శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, శాంతా కుమారి IAS, సినీనటుడు మరియు రాజకీయ నాయకులు మురళి మోహన్, డి ఆమే కుమారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, ప్రతీక్ జైన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ IAS తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x