Wednesday, January 22, 2025

ఒకేసారి 35 మందితో ఆ అమ్మాయి.. కారణం తెలిస్తే షాకవుతారు

ఈ మధ్య యువత చాలా ఫాస్ట్ అయిపోయారు. అందులోనూ అబ్బాయిలు సూపర్ ఫాస్ట్‌గా తయారయ్యారు. అయితే అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం రోజుకో గర్ల్ ఫ్రెండ్‌తో ఎంచక్కా షికార్లు చేస్తూ, షాపింగ్‌లు చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలానే ఉన్నా.. ఇప్పుడు అలాంటి ఓ అబ్బాయి గురించి చెప్పుకుందాం. అంత ప్రత్యేకత ఏముందబ్బా అంటారా..? కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి.. ఏదో ఒకరిద్దరు కాదు, ఏకంగా 35 మంది గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగాడు. అది కూడా ఒకరి తరువాత ఒకరు కాదు. అందరితో ఒకేసారి. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించాడు. అయితే తప్పు ఎక్కువ కాలం దాగదు. ఆతడి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు విషయం తెలియడంతో సదరు గర్ల్ ఫ్రెండ్స్ అంతా షాకయ్యారు. దీనికి తోడు ఆతడు అంతమందితో ప్రేమాయణం నెరగపడానికి గల కారణం తెలుసుకుని మరింత అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జపాన్‌ దక్షిణ ప్రాంతానికి చెందిన తకాషి మియాగావా(39) హైడ్రోజన్‌ వాటర్‌ షవర్‌ హెడ్స్‌, ఇతర పరికరాలు అమ్మే మార్కెటింగ్‌ కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మియాగావాకి తనకి పరిచయం అయిన వారిలో ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకునేవాడు. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. ముగ్గులోకి దింపేవాడు. ఆ తర్వాత తాను వారిని ఎంతో సీరియస్‌గా ప్రేమిస్తున్నానని నమ్మబలికేవాడు. అదే మాయమాటలతో ఏకంగా 35 మంది అమ్మాయిలను ఏకకాలంలో ప్రేమలో పడేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడి ప్రేమలో పడిన మహిళల్లో అతడి కంటే పెద్దవారు కూడా ఉన్నారు.

ఇక మియాగావా ఒరిజనల్‌ పుట్టిన రోజు నవంబర్‌ 14 కాగా.. తన ప్రియురాళ్లకి మాత్రం వేర్వేరు నకిలీ తేదీలు చెప్పి వారి నుంచి గిఫ్ట్స్‌ పొందేవాడు. ఒకరికి ఫిబ్రవరి.. మరోకరికి జూన్‌.. ఇంకొకరికి ఏప్రిల్‌ ఇలా ఫేక్‌ బర్త్‌డే డేట్స్ చెప్పి.. వారి నుంచి లక్ష జపనీస్‌ యెన్‌ల(69,442 రూపాయలు) విలువ చేసే దుస్తులు, డబ్బు బహుమతులుగా పొందాడు. అంతటితో ఆగక.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరి చేత తాను పని చేస్తున్న కంపెనీ ఉత్పత్తులు కొనేలా చేశాడు. అలా దాని మీద కూడా లాభం పొందాడు. అయితే ఏదీ ఎక్కువకాలం దాగదు. మియాగావా విషయంలో కూడా అదే జరిగింది. అతడి మీద అనుమానం వచ్చిన కొందరు ప్రియురాళ్లు మియాగావా గురించి ఎంక్వైరీ చేయగా అతడి బాగోతం బట్టబయలైంది. అంతా కలిసి అతడిని నిలదీయగా.. కేవలం బహుమతుల పొందడం.. తన ఉద్యోగంలో టార్గెట్‌ రీచ్‌ కావడం కోసమే ఇంత మందితో ప్రేమాయణం నడిపినట్లు అంగీకరించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మియాగావాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాదు.. అతడి గర్ల్ ఫ్రెండ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతుండడం గమనార్షం.

ఈ తంతుపై నెటిజన్లు తమ స్టైల్లో స్పందిస్తున్నారు. ‘నీ మార్కెటింగ్‌ తెలివికి జోహార్లు’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో.. ‘నెలకి 30 రోజులు.. రోజుకొక గర్ల్‌ఫ్రెండ్‌‌ను కలిసినా.. మరో ఐదుగురు బ్యాలెన్స్‌ ఉంటారు. ఎలా మ్యానేజ్‌ చేశావ్‌’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలూ జాగ్రత్త ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ జపాన్‌లోనే కాదు. మన దేశంలోనూ ఉండే ఉంటారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x