అంతరిక్షంలో భూమిలాంటి హాబిటబుల్ గ్రహాల కోసం సైంటిస్టులు వెదుకుతూనే ఉన్నారు. వారంతా మొదటగా దృష్టి సారించేది అంగారకుడిపైనే. అంగారకుడు పూర్తిగా రాళ్లు, శిలలతో నిండి ఉన్నప్పటికీ.. ఆ గ్రహంపై ఎక్కడో ఒక చోట మానవాళి నివశించేందుకు లేదా, ఇంతకుముందు నివశించినట్లు ఆధారాలు ఉండే అవకాశం ఉందనే నమ్మకంతో శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మార్స్‌పైకి ఉపగ్రహాలను పంపి అక్కడి వాతావరణాన్ని, నీటి జాడలను ఎప్పటివప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మార్స్‌పై మిలియన్ సంవత్సరాల క్రితం నీరు ఉండేదని గుర్తించారు. అంతేకాదు తాజాగా ఆ నీరంతా ఎక్కడుందో కూడా తెలుసుకున్నారు.
మార్స్‌పై ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ప్రస్తుతం ఆ గ్రహం పైపొరలో దాగి ఉందని, అంగారకుడి రాళ్లలో ఖనిజాల రూపంలో నిక్షిప్తమై ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు 52వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ‘భూమికి అయస్కాంత రక్షణ కవచం – మాగ్నెటోస్ఫియర్ – ఉంది. భూమి నుంచి వాతావరణం బయటి విశ్వంలోకి జారిపోకుండా నిరోధించటానికి ఈ కవచం సాయపడుతుంది. కానీ మార్స్ మాగ్నెటిక్ షీల్డ్ బలహీనంగా ఉంది. దానివల్ల ఆ గ్రహం మీది నీటిలోని మౌలిక మూలకాలు గ్రహం మీది నుంచి అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉండవచ్చ’ని లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా.. ఒకప్పుడు కిలోమీటరు లోతు వరకూ నీరు అంగారకుడిపై ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఆ నీరంతా కోట్ల సంవత్సరాల కాలంలో మాయం కావడానికి కారణాలను కూడా వివరించారు. దీని కోసం ఏకంగా ఓ కంప్యూటర్ నమూనానే అభివృద్ధి చేశారు. అయితే వాతావరణం మార్పులకు లోనైనప్పుడు, గ్రహాలు తనలోని నీటిని ఖనిజాలతో కలిపి దాచేస్తుంది. అంటే వాస్తవంలో ఆ నీరు చిక్కుబడిపోతుందని కాల్‌టెక్‌కే చెందిన ప్రొఫెసర్ బెథనీ హెల్మన్ అన్నారు. తాజాగా చేసిన పరిశోధనల నేపథ్యంలో రూపం మారిపోయి నీటి ఆధారాలు లభించాయని తెలిపారు.
‘మార్స్‌పై నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. ఇక ఉపరితలానికి కేవలం కొంచెం కింది భాగంలో గల మంచు నిల్వలు.. కొంత నీరు ఘనీభవించిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. భూమికి అయస్కాంత రక్షణ కవచం – మాగ్నెటోస్ఫియర్ – ఉంది. భూమి నుంచి వాతావరణం బయటి విశ్వంలోకి జారిపోకుండా నిరోధించటానికి ఈ కవచం సాయపడుతుంది. కానీ మార్స్ మాగ్నెటిక్ షీల్డ్ బలహీనంగా ఉంది. దానివల్ల ఆ గ్రహం మీది నీటిలోని మౌలిక మూలకాలు గ్రహం మీది నుంచి అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉండవచ్చు. అయితే.. నీటిలోని ఒక రసాయన మూలకమైన హైడ్రోజన్ ఇప్పుడు ఆ గ్రహపు వాతావరణం నుంచి జారిపోతోంది. దీంతో కోట్ల సంవత్సరాల క్రితం మిగిలిన వాతావరణం కూడా ఇదే తరహాలో ఆ గ్రహం నుంచి విడిపడి విశ్వంలో కలిసిపోయి ఉండవచ్చనే అంచనా ఏర్పడుతోంది’ అంటూ లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ పీటర్ వెల్లడించారు.
వాతావరణం మార్పులకు లోనైనప్పుడు, గ్రహాలు తనలోని నీటిని ఖనిజాలతో కలిపి దాచేస్తుంది. అంటే వాస్తవంలో ఆ నీరు చిక్కుబడిపోతుందని అధ్యయనం మరో సహ రచయిత, కాల్‌టెక్‌కే చెందిన ప్రొఫెసర్ బెథనీ హెల్మన్ వెల్లడించారు. మార్స్ మిషన్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేయటం ద్వారా.. నీరు రూపం మారిపోయిన ఆధారాలు లభించటం సాధ్యమైందని, అరుదైన విషయం కాదని స్పష్టమైందిని ఆమె తెలిపారు. అంగారకుడి మీద నీటిలో అత్యధిక భాగం 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల కిందటి వరకూ క్రమంగా మాయమైందని, మార్స్ చరిత్రలో ఈ కాలాన్ని ‘నోచియాన్ పీరియడ్’గా పిలవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ గ్రహంపై నీరంతా పై పొరల్లో చిక్కగా మారి ఖనిజాల రూపంలో ఉందన్నమాట.