Wednesday, January 22, 2025

షాకింగ్!! కరోనా రోగుల్లో మరో కొత్త ఫంగస్?

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కొందరు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నా.. చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవడం లేదు. కరోనా నుంచి కోలుకున్న వారం, 10 రోజుల్లోనే రకరకాల ఫంగస్‌లు వారి శరీరంపై దాడి చేసి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. లేదంటే.. దివ్యాంగులుగా మారుతున్నారు. అయితే ఈ ఫంగస్‌ ఒకపక్క భయపెడుతుండగానే మరో ఫంగస్ వెలుగులోకొచ్చింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్‌కంటే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఫంగస్ బాధితుడి ఊపిరితిత్తులు, ముఖంపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనిని కూడా ముందుగా గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. ఈ రెండింటితోనే ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. తాజాగా మరో ఫంగస్ వెలుగులోకొచ్చింది. అదే ఎల్లో ఫంగస్.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఈ ఎల్లో ఫంగస్.. బ్లాక్, వైట్ ఫంగస్‌ల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్‌తో చికిత్స అందించవచ్చని వైద్యులు వెల్లడించారు.

నిల్వ ఉన్న పదార్థాలు ఫంగస్ పెరుగుదలకు దోహదపడుతాయి. పరిశుభ్రత లేకపోవడం వల్లే ఎల్లో ఫంగస్ ప్రధాన వ్యాపికి కారణం. అందువల్ల ఇంటి లోపల, బయట వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కావున వీలైనంత వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో తేమ శాతం ఎక్కువ ఉన్నా.. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుతాయి. కావున తేమ స్థాయి 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎల్లో ఫంగస్ బారిన పడకుండా బయటపవచ్చని నిపుణులు చెబుతున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x