Friday, November 1, 2024

నటుడు చంద్రమోహన్ ఇంటర్వ్యూ

ఓ తరానికి హీరో.. రెండో తరానికి తండ్రి…మూడో తరానికి విలక్షణ నటుడు… నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో పని చేసిన అనుభవం…ఐదున్నర దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమతో మమేకమైన నట జీవితం… చంద్రమోహన్ గురించి ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? కథానాయకుడిగా, స్నేహితుడిగా, తండ్రిగా, వినోదాత్మక – భావోద్వేగభరిత పాత్రల్లో చక్కటిఆర్టిస్టుగా… నటనలో వివిధ కోణాలను ఆవిష్కరించే విలక్షణ పాత్రలు పోషించిన పరిపూర్ణనటులు చంద్రమోహన్. హీరోగా 175కు పైగా సినిమాలు చేసిన ఆయన, 55 ఏళ్ళ కెరీర్ లోమొత్తం 932 సినిమాలు చేశారు. ఆదివారంతో 80 ఏళ్ళు పూర్తి చేసుకుని 81వవసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ తో ఇంటర్వ్యూ.

చంద్రమోహన్ గారు… జన్మదిన శుభాకాంక్షలు!
-థాంక్యూ

ప్రశ్న: మీరు గతంలో పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
జవాబు: పెద్ద కుటుంబంలో ఉండటం వల్ల అసలు పుట్టినరోజు అంటూ ప్రత్యేకంగా ఏమీఉండేది కాదు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మా సినిమా ఫ్యామిలీ చాలా ఏళ్ళు, చాలా సార్లు ఘనంగా సెలబ్రేట్ చేసింది. పుట్టినరోజున సినిమా సెట్ లో కాకుండా… ఒకవేళఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా, హాయిగా సెలబ్రేట్ చేసుకునేవాడిని. దానికి ముఖ్య కారణం… నా సతీమణి, మా అమ్మాయిలు, ఇప్పుడు మనవరాళ్లు, మా మేనల్లుళ్లు, వాళ్ల కుటుంబాలు.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
నా సతీమణి జలంధర. ఆమె గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచిరచయిత్రి. ఎన్నో మంచి కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలుచేస్తోంది. పెళ్లి తర్వాత నా ప్రోత్సాహం కూడా తోడయ్యింది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది, నా కోపాన్నితగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. హ్యాపీ లైఫ్‌. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్తబ్రహ్మ అశోక్‌ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమెభర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు – అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్‌ హ్యాపీగాసాగిపోయింది. బంధువుల ఫంక్షన్లకు కూడా మా ఆవిడే వెళ్లేది.

ప్రశ్న: కరోనా సమయం కాబట్టి రెండేళ్లుగా పరిశ్రమ ప్రముఖుల మధ్య ఘనంగా సెలబ్రేట్చేసుకునే వీలు లేదు. ఎక్కువమంది మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా పోయింది.
జవాబు: రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. గత ఏడాది మా సిస్టర్స్, వాళ్లకుటుంబ సభ్యులు వచ్చారు. ఈసారి లాక్‌డౌన్ కావడం వలన వాట్సాప్ వీడియో కాల్స్ తోసరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ప్రశ్న: నటుడిగా 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం మీది. విశ్రాంతి లేకుండా నటించారు. మీ మోటివేషన్ ఏంటి?
జవాబు: కొన్ని రోజులు కెరీర్ లో స్థిరపడటం, కొన్ని రోజులు ఫైనాన్షియల్ గా సెటిల్ కావడంనా మోటివేషన్. ఆ తర్వాత నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం వర్క్ చేశాను. కానీ, ఏ వేషం అంగీకరించినా… అది నా పరిధిలో బాగా చేయాలనీ, ఫస్ట్ టేక్‌లో ఓకే చేయాలన్నఛాలెంజ్ చాలా పెద్ద మోటివేషన్.

ప్రశ్న: హీరోగా విజయవంతమైన మీరు, తర్వాత కాలంలో వినోదాత్మకపాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. అప్పటి, ఇప్పటి వినోదంపై మీ స్పందన?
జవాబు: వినోదం చాలా సులభంగా కనిపించే అతి కష్టమైన ప్రక్రియ. ఆ పాత్రలువేస్తున్నప్పుడు హీరోలకు, ముఖ్య పాత్రలకు ఉండే సపోర్ట్ సిస్టమ్ మాకు ఉండదు. ఇండస్ట్రీలో ప్రతి కమెడియన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే… అతనికి డైలాగ్ లో పంచ్, మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా జనం నాడి తెలుసుకోవాలి. సన్నివేశంలో ఇతరఆర్టిస్టులను డామినేట్ చేయకూడదు. మన మూడ్, సిట్యువేషన్ తో సంబంధం లేకుండానటించాలి. హాస్య నటులకు ఉన్న మరింత కష్టం… త్వరగా స్టేల్ అవుతారు. ప్రేక్షకులు ప్రతికమెడియన్ నుంచి ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు. మంచి దర్శకుల దగ్గర ట్రయినింగ్, అబ్జర్వేషన్, మా ఫ్యామిలీలో మేం నవ్వకుండా నవ్వించే అలవాటు ఉండటం – ఇవన్నీ నాకమెడియన్ పాత్రలకు సహాయపడి, నన్ను సక్సెస్ చేశాయి. మా తమ్ముడు, అక్కయ్యలు, నాన్నగారు – అందరూ నవ్వకుండా నవ్వించే అలవాటు ఉన్నవాళ్లే. ఆ కాలమైనా, ఈకాలమైనా… సిట్యువేషనల్ కామెడీ మంచిదని నా అభిప్రాయం.

ప్రశ్న: హీరోగా, నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేశారు. ప్రతినాయకుడిగా ఏమైనా చేశారా?
జవాబు: రెండు మూడు చేశాను. అందులో ‘గంగ మంగ’ సినిమాను ప్రధానంగాచెప్పుకోవాలి. అలాగే, జయసుధ సినిమా ‘లక్ష్మణరేఖ’లో నాది నెగెటివ్ రోల్.

ప్రశ్న: అప్పట్లో హీరోగా చేస్తూ, సహాయక పాత్రలు చేయడానికి కారణం?
జవాబు: పరిస్థితుల ప్రభావం! ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాకతప్పదని అర్థమైంది. హీరోగా మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాడిని కాదు.

ప్రశ్న: ఈమధ్య చిత్రాలు చేయడం తగ్గించారు. ఎందుకని?
జవాబు: దీనికి ముఖ్య కారణం… నా ఆరోగ్యం. దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగాపని చేసి, నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఎవరైనా హెచ్చరించినా… ఇనుముకుచెదలు పడుతుందా? అని వెటకారం చేసేవాడిని. కానీ, నా నిర్లక్ష్యం నన్ను దెబ్బ తీసింది. నా వల్ల నా నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకు ఇష్టం లేదు. ‘రాఖీ’లో ఎమోషనల్ సీన్చేసి వచ్చి… బైపాస్ సర్జరీ కోసం నేరుగా ఆసుపత్రిలో చేరాను. అలాగే,’దువ్వాడజగన్నాథమ్’ షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే, రిటైర్మెంట్ తీసుకోవాలనినిర్ణయించుకున్నాను. అయినా… ప్రతిరోజూ టీవీలో నా సినిమా ఏదో ఒకటి వస్తోంది. యూట్యూబ్ ద్వారా చాలా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులుఅవన్నీ చూస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు అభిమానులు ఎక్కువ అయ్యారు. అదిఆశ్చర్యంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ‘ఇది చాలు’ అనిపిస్తుంది.

ప్రశ్న: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి?
జవాబు: చాలా చాలా ఉన్నాయి. సక్సెస్అయిన సినిమాలు మీ అందరికి తెలుసు. సక్సెస్ కాని సినిమాల్లో ‘భువనేశ్వరి’ వంటివిచాలా ఉన్నాయి.

ప్రశ్న: మీ డ్రీమ్ రోల్ ఏది?
జవాబు: అలా అని ఏమీ లేదు. కానీ, నాలో నాకే తెలియని టాలెంట్ ఉందని బీఎన్రెడ్డిగారు, బాలచందర్ గారు, ఎస్వీ రంగారావు గారు వంటి గురుతుల్యులు చాలామందిచెప్పేవారు. దర్శకులు ఎంత తీసుకోగలిగితే అంత ప్రతిభ ఉందని చెప్పిన వాళ్ల ఆశీసులకున్యాయం చేసే పాత్రల కోసం ఎదురు చూశా. మా అన్నయ్య విశ్వనాథ్ గారు, బాపుగారు, బాలచందర్ గారు నాలో చాలా సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ట్రై చేసి సక్సెస్ అయ్యారు. నాప్రేక్షకులు ఆనందించిన అన్ని పాత్రలు నాకు ఆశీర్వచనాలు ఇచ్చాయి. అదే తృప్తి.

ప్రశ్న: ఇతర భాషల్లో నటించారా?
జవాబు: తమిళంలో ఐదు చిత్రాలు… మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రంలోనటించాను. తమిళంలో ఎంజీఆర్‌తో ‘నాళై నమదై’లో నటించాను. అది ‘అన్నదమ్ములఅనుబంధం’ రీమేక్. తెలుగులో బాలకృష్ణ పోషించిన పాత్రను తమిళంలో నేనుచేశా. శివాజీ గణేశన్‌తో ‘అండమాన్ కాదలై’ సినిమా చేశా. తెలుగులో ‘అండమాన్అమ్మాయి’గా రీమేక్ చేశారు. రెండు భాషల్లో నేను నటించాను. ముత్తురామన్ దర్శకత్వంవహించిన ‘సుడరుమ్ సురావళియుమ్’ చేశా. అలాగే, నటి శ్రీప్రియ సొంత చిత్రం’నీయ’లో చేశాను. హిందీలో ఏమీ చేయలేదు. మలయాళంలో షీలా కాంబినేషన్ లో’అనంత శయనం’ అనే సినిమా చేశా. టీచర్‌తో స్టూడెంట్ లవ్ స్టోరీ అది. అందులోనిక్కరు వేసుకుని నటించా. నా కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమా అది.

ప్రశ్న: అప్పటికి, ఇప్పటికి చిత్రసీమలో ఎటువంటి మార్పులు వచ్చాయి? కరోనా తర్వాత…
జవాబు: ఆ కాలంలో ఎక్స్‌పీరియన్స్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. సీనియర్ నటుడు ఎప్పుడూతన ఎక్స్‌ప్రెషన్ లో విడిగా కనబడుతూ ఉండేవాడు. ఈ కాలంలో గ్లామర్, ఫైట్స్, సాంగ్స్పిక్చరైజేషన్ కి ఇంపార్టెన్స్ వచ్చింది. ఒకే సన్నివేశాన్ని చాలా షాట్స్ లో తీస్తున్నారు. తెలివిగల ఫొటోగ్రాఫర్, దర్శకుడు ఉంటే సన్నివేశాన్ని వాళ్లే నిలబెడతారు. దానికి ఆర్టిస్ట్టాలెంట్ 50 శాతం చాలు. ఇది కొత్త ట్రెండ్. మా సినిమా ఇండస్ట్రీలో వేలమందికి ఉపాధికల్పించినంత కాలం, మా నిర్మాతలు చల్లగా ఉన్నంత కాలం ఏ ట్రెండ్ అయినాపర్వాలేదు. కరోనా మాత్రం మా సినిమా ఇండస్ట్రీకి ఉపాధి లేకుండా దెబ్బకొడుతోంది. ఇదినాకే కాదు… నాతోటివారు అందరికీ బాధ కలిగించే విషయం.

ప్రశ్న: సినీ జీవితం నేర్పిన పాఠాలు?
జవాబు: పేరు, డబ్బు, బంధాలు – ఏవీ శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకుదూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. ఎప్పటికీచెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది.

ప్రశ్న: జాతీయ పురస్కారాల్లో తెలుగువారికి అన్యాయం జరుగుతుందని కొందరుఅంటున్నారు. మీరేమంటారు?
జవాబు: అందరి విషయం అని కాదు. బీఎన్ రెడ్డి, కె. విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీలగారు… చాలామందికి గౌరవపూర్వకమైన అవార్డులు వచ్చాయి. కానీ… ఎస్వీరంగారావు, సావిత్రమ్మ, కన్నాంబ, నాగయ్య గారు వంటి చాలామంది మంచి ఆర్టిస్టులకుఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని నా అభిప్రాయం.

ప్రశ్న: మీ ప్రతిభకు తగ్గ పురస్కారం రాలేదనే అసంతృప్తి ఏమైనా…
జవాబు: ప్రజాభిమానమే నాకు పెద్ద అవార్డు. రివార్డులు. నాలో ఎటువంటి అసంతృప్తిలేదు.

ప్రశ్న: కరోనా నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జవాబు: నాకంటే మా ఇంట్లోవాళ్ళు నాపట్ల ఎక్కువ జాగ్రత్త వహిస్తున్నారు. నాకు చాలాస్వేచ్ఛ పోయినట్టు ఉంది. కానీ, తప్పదు. మనం మరొకరికి ఇబ్బంది కాకూడదు కదా. అందరం వీలైనంత వరకూ జాగ్రత్తలు పాటించి, మనల్ని మనం రక్షించుకోవడం, ఎదుటివాళ్ళకు రక్షణ ఇవ్వడం తప్పనిసరి.

ప్రశ్న: పుట్టినరోజు సందర్భంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు, ప్రేక్షకులకు ఏమైనా చెబుతారా?
జవాబు: ఇన్నేళ్లూ నన్ను గుండెల్లో అదుముకుని, ఆశీర్వదించిన సినీ కళామతల్లికి, నాతోటికళాకారులకు… అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వకకృతజ్ఞతలు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x