Friday, November 1, 2024

చంద్రబాబు నిందితుడే.. కోర్టు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి.. సీఐడీ కౌంటర్

అమరావతి భూసేకరణ విషయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అవినీతికి పాల్పడ్డారని, వారిని ఎలా విడిచిపెడతారంటూ సీఐడీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వారిద్దరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేసి చట్టాన్ని అతిక్రమించారని, అలాంటి నిందితులను వదిలిపెట్టడం సరికాదని తమ పిటిషన్లో సూచించింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు, నారాయణలు వేరువేరుగా హైకోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ జరిగిప హైకోర్టు విచారణ అనంతరం ఈ కేసులోని తదుపరి చర్యలన్నింటినీ ఆపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబు విషయంలో ఇచ్చిన ఉత్తర్వులు సమంజసం కాదని, వాటిని వెంటనే హైకోర్టు ఎత్తివేయాలని ఆ పిటిషన్లో కోరారు.

హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఐడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారి ఏ లక్ష్మీనారాయణ రావు ఆ అఫిడవిట్‌లో అనేక విషయాలను పొందుపరిచారు. 2016 ఫిబ్రవరిలో జీవో 41(రాష్ట్ర అసైన్డ్ భూముల బదిలీ చట్టం)ను చట్ట నిబంధనలకు విరుద్దంగా తీసుకువచ్చారని, ఈ జీవో ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉందని, పేద ప్రజల అసైన్డ్ భూములను ఆక్రమించి.. లబ్ది పొందాలన్న దురుద్దేశంతోనే ఈ జీవోను తీసుకువచ్చారని విచారణలో తేలిందని అందులో పేర్కొన్నారు.
అంతేకాకుండా విచారణలో భాగంగా నోట్ ఫైల్‌ను కూడా పరిశీలించామని, జోవో జారీకి ముందు కానీ, ఆ తర్వాత కానీ కేబినెట్‌లో ఉంచలేదని తెలిపారు. కేవలం ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్ ఆమోదంతోనే ఈ జీవో ముందుకు నడిచిందని చెప్పారు. రాష్ట్ర అసైన్డ్ భూముల నిరోధక చట్టం 1977 ప్రకారం ఈ భూ బదలాయింపు జీవో చట్ట విరుద్ధమని అన్నారు. జీవో జారీలో చంద్రబాబు, నారాయణల పాత్రపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని కోరారు.

‘రెవెన్యూ రికార్డుల ప్రకారం భూములు ఆక్రమించిన వారికి అసైన్డ్ భూముల పట్టాలు కూడా లేవు. నిబంధలను ప్రకారం ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయి.
అయితే కొత్త జీవో ద్వారా ప్రజలను నమ్మించి మోసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోనికి తీసుకుని సెక్షన్ 146 ప్రకారం పిటిషనర్‌ను విచారించి కేసు నమోదు చేశాం’ అని సీఐడీ తెలిపింది.
అయితే కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయడం న్యాయవ్యవస్థ ప్రక్రియను దుర్వినియోగం చేయడంతో సమానం అని, వీటిని పరిశీలించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును సీఐడీ కోరింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x