కేంద్రం హోం మంత్రి అమిత్‌తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. అయితే ఈ సమావేశం మొత్తం రహస్యంగానే కనిపిస్తోంది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అంతకుముందు పలువరు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులను కూడా సీఎం జగన్ కలిశారు. కానీ ఏ విషయాలపై జగన్ చర్చించారు..? అమిత్ షా నుంచి ఎలాంటి స్పందన వచ్చింది..? అనే విషయాలపై మాత్రం ఎలాంటి విషయాలూ బయటకు రావడం లేదు. దీంతో అమిత్ షాను జగన్ కలిసినదంతా రహస్యమేనని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
అంతకుముందు కేంద్రమంత్రులు జవదేకర్, షెకావత్‌తో ఉన్నారు. రాత్రి 7 గంటలకు పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. జగన్ భేటీకి సంబంధించిన వివరాలు, ఫోటోలు బయటకు వచ్చాయి కానీ.. అమిత్ షాతో జగన్ భేటీకి సంబంధించి మాత్రం ఒక్క విషయం కానీ, ఫోటో కానీ బయటకు రాలేదు.
ఇదే సమయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ మాత్రం సీఎం జగన్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వ వర్గాలు మాత్రం పోలవరం సహా పలు అంశాలపై వినతులు ఇచ్చినట్లు చెబుతున్నాయి.