Friday, November 1, 2024

ఆపరేషన్ సౌమ్య బిగిన్స్.. ఉగ్రవాదులు ఫినీష్..

సరిగ్గా ఏడాది క్రితం కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం ఒక్కటై పోరాడింది. కానీ ఇప్పుడు ఆ వైరస్ ప్రభావం ఇండియాలో తప్ప ఇతర దేశాలన్నింటిలో తగ్గిపోయింది. కానీ ఈ మధ్యలోనే ఇజ్రాయెల్-పాలస్థీనాల మధ్య యుద్ధం రేగుతోంది. పాలస్తీనాలోని హమాజ్ తీవ్రవాదులతో ఇజ్రాయిల్ పోరాడుతోంది. ఇటీవల ఒక్కసారిగా ఇజ్రాయిల్‌పై దాడులు జరగడంతో.. వాటికి ప్రతిగా.. ఇజ్రాయిల్ ప్రతి దాడులు చేస్తోంది. వారం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ దాడులతో పాలస్తీనా వణికిపోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా తన తీరును ఏమాత్రం మార్చుకోనని, తన అంతర్గత విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని ఇజ్రాయిల్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

ఇజ్రాయెల్-పాలస్థీనాల మధ్య యుద్ధాన్ని ప్రపంచలోని 57 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఒకపక్క అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, అమెరికా, ఐక్యరాజ్ర సమితి ప్రశ్నలతో పాటు అరబ్ దేశాలు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఆగడం లేదు. అంతేకాకుండా ఇజ్రాయిల్‌పై జరిగిన దాడుల్లో మరణించిన భారతీయ మహిళ సౌమ్య పేరిటే ఇజ్రాయెల్ ఈ ఓ ప్రత్యేక దాడులు చేస్తోంది. ఆపరేషన్ ‘సౌమ్య’ అని ఓ ఆపరేషన్ చేపట్టింది. తన దేశంలోని ఓ యుద్ధ విమానానిక ఆమె పేరును పెట్టి దాని చేత పాలస్తీనాపై దాడులు చేయిస్తోంది. అంతేకాకుండా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆ దేశ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని మోదీకి కూడా తెలియజేస్తున్నట్లు సమాచారం.

కాగా.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇంకొన్ని రోజుల్లో అక్కడ ప్రతిపక్ష నేత బేనీ గేట్స్ ప్రభుత్వ ఏర్పాటుకి అక్కడి రాష్ట్రపతి ఆమోదం కూడా ఇచ్చేశారు. ఇంతలో ఇజ్రాయిల్‌కు, హమాజ్ ఉగ్రవాదుల మధ్య యుద్దం స్టార్ట్ అయింది. ఈ దాడుల్లో బెనీ గేట్స్, అతడి నేతలు ప్రధాని నెతన్యాహుకు మద్దతునిచ్చారు. ఇక బెనీ గేట్స్ కూడా ఇప్పుడు తన ప్రమాణ స్వీకారం ముఖ్యం కాదని, దేశ రక్షణే ప్రధానమని చెప్పుకొచ్చారు. యుద్దం పూర్తయిన తర్వాతే తాను పదవిని స్వీకరిస్తానని, అప్పటి వరకు నెతన్యాహూయే దేశ ప్రధాని అని పేర్కొన్నారు. అంతేకాకుండా పాలస్తీనాలో ఏ ఒక్క ఉగ్రవాది కూడా ఉండకూడదని, దాడులను మరింత తీవ్రం చేయమంటూ నెతన్యాహూకు బెనీ గేట్స్ సూచనలిచ్చారు. దీంతో బెనీ గేట్స్ అసలైన ప్రజా నాయకుడంటూ ఇజ్రాయిల్ ప్రజలు అతడిని ప్రశంసిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x