Friday, November 1, 2024

కరోనా మందు గోమూత్రమే.. బీజేపీ ఎంపీ అనిపించుకున్న ప్రగ్యా

ప్రపంచంలో కరోనా అడుగుపెట్టినప్పటి నుంచి బీజేపీ నేతలు విచిత్రమైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు కరోనాకు ఇంగ్లీష్ మెడిసిన్స్, డాక్టర్ల వైద్యం అవసరం లేదని, కేవలం గోమూత్రం తాగి, ఆవు పేడతో స్నానం చేస్తే కరోనా పోతుందంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తాను రోజూ గో మూత్రం తాగుతానని, అందువల్లే కరోనా బారిన పడలేదని ప్రగ్యా చెబుతున్నారు.

ఇటీవల పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రగ్యా ఠాకూర్ తాను రోజు గోమూత్రం సేవిస్తానని చెప్పారు. గోమూత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంజీవని అని, దీనిని తాగడం వల్ల అనేక రోగాలకు చెక్ చెప్పవచ్చని ఆమె తెలిపారు. 2 సంవత్సరాల క్రితం గోమూత్రంతో పాటు గోవు నుంచి వచ్చే ఇతర పథార్థాలతో తన క్యాన్సర్ కూడా తగ్గిందని ఆమె చెప్పుకొచ్చారు. ‘నేను రోజూ గోమూత్రం తాగుతాను, అందుకనే కరోనా ఔషధం తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. గోమూత్రంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దాని కారణంగా ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి, రక్తంలో చేరిన మలినాలు బయటకు తోసివేయబడతాయ’ని ప్రగ్యా ఠాకూర్ అన్నారు.

కాగా.. ప్రగ్యా ఇలాంటి వ్యాఖ్యలే ఇంతకుముందు కూడా చేశారు. గోమూత్రం, గో వ్యర్థాలన్నింటి కరోనాను చంపేయగలమని, ఇతర వైద్య ఔషధాలన్నింటి అవసరం లేదని చెప్పారు. అయితే వైద్యులు మాత్రం ఇటువంటి మాటలు నమ్మవద్దని, గోమూత్రం తీసుకోవడంతో కరోనాను అరికట్టడం కుదరదని చెబుతున్నారు. దానిని నిరూపించే విధంగా ఎటువంటి రుజువులు లేవని, గోమూత్రం రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా ఎటువంటి ఆధారాలు లేవని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రగ్యా గతేడాది డిసెంబరులో కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x