కరోనా థర్డ్‌వేవ్ అల్ రెడీ వచ్చేసిందా..? ఇప్పటికే తన ప్రభావం చూపించేస్తోందా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నార పెడియాట్రిషన్స్. ఇప్పటికే కరోనా బారినపడిన చిన్నారులకు వైద్యం అందిస్తున్నామని, గతంలో కరోనా వైరస్ బారినపడినవారు తేలికపాటి వైద్యంతోనే కోలుకునేవారని, కానీ ఇప్పుడు కొన్ని కేసులలో 12, 13ఏళ్ల చిన్నారులు కూడా ఊపిరితిత్తుల్లో వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర ఇబ్బందులు బాధపడుతున్నట్టు గుర్తించామని తెలిపారు.
కారణం డెల్టా వేరియంట్:
‘ఏప్రిల్‌లోనే ఈ వేరియంట్ కేసులు గుర్తించాం. సెకండ్‌వేవ్‌లో చిన్నారుపైనా వైరస్ ప్రభావానికి డెల్టా వేరియంటే కారణం. ఇంత జరుగుతున్నా.. రానున్న రోజుల్లో కరోనావైరస్ ఎంతమంది చిన్నారులకు ప్రాణాంత కంగా మారుతుందనే అంశంలో ప్రభుత్వాల వద్ద కనీస అంచనాలు లేవు.
వైద్యుల హెచ్చరికలతో ప్రత్యేక వార్డులు:
కాగా చిన్నారులపై థర్డ్‌వేవ్ పంజా విసరనుందనే నిపుణుల హెచ్చరికతో ప్రభుత్వం ప్రత్యేక పెడియాట్రిక్ కొవిడ్‌వార్డులను ఏర్పాటు చేస్తుండగా మరోవైపు పాఠశాలలను తెరవడానికి సన్నద్ధం కావడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెల్టా వేరియంట్ కేసులు 90 శాతం:
ఆగస్టు చివరి నాటికి ఈయూ దేశాలలో డెల్టా వేరియంట్ కొత్త కోవిడ్ కేసులు 90 శాతం ఉండొచ్చని ఇసిడిసి పేర్కొంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించిన డెల్టా వేరియంట్ ఆగస్టు చివరి నాటికి ఈయూ దేశాలలో కొత్త కోవిడ్-19 కేసులలో 90 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. డెల్టా వేరియంట్ వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ ప్రభావం చూపగలదని ఈసీడీసీ తెలిపింది.