Sunday, March 22, 2026

టీమిండియాపై ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌ల వర్షం.. ఆటగాళ్లకు ఎస్‌యూవీలు

టీమిండియా ఆటగాళ్లకు వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బహుమతులమీద బహుమతులిస్తున్నాడు. తాజాగా టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్‌గా అందించాడు. ఈ విషయాన్ని శార్దూల్ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ వచ్చేసింది. నిజంగా అద్భుతమైన వాహనాన్ని మహీంద్రా రూపొదించింది. దీనిని నడపడం ఎంతో సంతోషంగా ఉంది. దీనిని బహుమతిగా పంపించినందుకు మరోసారి కృతజ్ఞతలు ఆనంద్ మహీంద్రా జీ. ఆసీస్‌ పర్యటనలో మా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు పక్వాకంకర్ జీ’ అని శార్దూల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా.. అంతకుముందు ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్‌తో సిరీసుల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా పేసర్ టీ నటరాజన్‌కు కూడా ఆనంద్ మహీంద్రా ఓ మహీంద్రా ఎస్‌యూవీ వామనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నటరాజన్ ప్రదర్శనకు ముగ్ధుడైన మహీంద్రా.. ఇలా ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చి నటరాజన్‌ను ఆనందపరిచాడు. దీన్ని అందుకున్న నటరాజన్.. మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా ఎస్‌యూవీకి బదులుగా గబ్బా టీషర్ట్‌పై సంతకం చేసి దాన్ని ఆనంద్ మహీంద్రాకు పంపించాడు.

కాగా.. ఆసీస్ పర్యటనలో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాపై 2-1తో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌‌లకు ఎస్‌యూవీలు బహుమతిగా ఇస్తానని ఆనంద్ మహీంద్రా మాటిచ్చారు. ఆ మాట ప్రకారం.. కొద్ది రోజుల క్రితం నటరాజన్‌కు ఎస్‌యూవీ పంపిన ఆనంద్ మహీంద్రా.. తాజాగా శార్దూల్‌కు పంపారు. మరి మిగతావారికి కూడా ఎప్పటిలోగా అందుతాయో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -