Sunday, March 22, 2026

క్వారంటైన్ ముగిసిన ఆనందంలో మైకెల్ జాక్సన్ స్టెప్పులతో ఇరగదీసిన గేల్

ఈ ఏడాది ఐపీఎల్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లంతా భారత్‌ చేరుకున్నారు. ఐపీఎల్ కోసం వచ్చిన విదేశీ ఆటగాళ్లందరూ 7 రోజులు క్వారంటైన్‌లోనే గడపారు. తాజాగా పంజాబ్ ఆటగాళ్లంతా ఈ క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు యాజమాన్యం ఓ వీడియోను షేర్ చేసింది. అందులో పంజాబ్ స్టార్ ఓపెనర్, విండీస్‌ విధ్వంసక వీరుడు గేల్.. అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఈ వీడియోలో గేల్ మైఖేల్‌ జాక్సన్‌ సూపర్‌ హిట్‌ పాట ‘మూన్‌ వాక్‌’కు తన స్టైల్లో డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇంతకుముందు కూడా గేల్ ఇలా అనేకసార్లు డ్యాన్స్ చేసి తన అభిమానులను అలరించాడు. ముఖ్యంగా గత 7 రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న గేల్‌.. పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చారు. డ్యాన్స్‌, వర్కౌట్స్‌ చేస్తూ కాలక్షేపం చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా పంజాబ్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో తరచూ పోస్ట్ చేసింది.


ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్‌లో ఆలస్యంగా బరిలోకి దిగినా గేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్‌ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్థ శతకాలు కూడా ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టులో మూడో స్థానంలో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంది. పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టును ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా జరగనుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -