ముంబై మరోసారి మ్యాజిక్ చేసింది. సన్‌రైజర్స్‌ను మట్టి కరిపించి టోర్నీలో వరుసగా రెండో గెలుపు సొంతం చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో బెంగళూరును రెండో స్థానానికి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరింది. కాగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. 13 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. సూపర్ ఓపెనింగ్ దక్కింది. జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(37: 34 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ముంబై బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అయితే మిడిలార్డర్ దారుణ వైఫల్యంతో గెలుపునకు దూరమైంది.
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మినహా మిగతా వారిలో ఒక్కరు కూడా రాణించలేదు. మనీష్ పాండే(2), విరాట్ సింగ్(11), విజయ్ శంకర్(28), అభిషేక్ శర్మ(2), అబ్దుల్ సమద్(7), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(1), ఖలీల్ అహ్మద్(1) కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో టోర్నీలో వరుసగా మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది. బెయిర్ స్టో, వరుస ఓవర్లలో వికెట్ల కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. వార్నర్ తరువాత విజయ్ శంకర్(28) మాత్రమే కొద్దిగా పర్వాలేదనిపించాడు.
కాగా.. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ 3 వికెట్లతో రాణించగా, జస్ప్రిత్ బుమ్రా ఓ వికెట్ తీశాడు. అయితే బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3.50తో బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు. ఈ విజయంతో ముంబై.. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో టాప్‌కు చేరింది. కాగా.. సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవకపోవడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది.