ఐపీఎల్ 14వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఓడిపోతూ దారుణ ప్రదర్శన చేస్తోంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా లయ కోల్పోయింది. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. ఇక మూడో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కూడా గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. చెన్నై వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. చెన్నైలో మ్యాచ్‌లు ముగించుకున్న కోల్‌కతా జట్టు.. మరోవేదికైన ముంబై వెళ్లనుంది. తర్వాతి మ్యాచ్ కోసం జట్టు కూర్పు, మార్పులపై ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తుది జట్టులోకి తీసుకోన్నట్లు మెక్‌కల్లమ్ వెల్లడించాడు. నరైన్ ఫామ్‌లో ఉంటే బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టగలగడం అతడి స్పెషాలిటీ. మరి నరైన్ రాకతోనైనా కేకేఆర్ రాత మారుతుందేమో చూడాలి.
మెక్ కలమ్ మాట్లాడుతూ.. ‘మా మొదటి మ్యాచ్‌కు ముందు సునీల్ నరైన్ గాయంతో 100 శాతం ఫిట్‌గా లేడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు అతడు అందుబాటులో ఉన్నాడు. ఐతే తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించిన షకీబ్ అల్ హసన్‌ను కొనసాగించాం. తర్వాతి మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు మార్పులు చేయాలనుకుంటున్నాం. టోర్నీలో మాకు మంచి అవకాశం ఉందని చూపించాం. మూడు మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఐతే మేం ఊహించని ఫలితాలు రాలేదు. ముంబైలో కొంచెం భిన్నమైన వికెట్ కావడంతో కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని’ వెల్లడించాడు.