సన్‌రైజర్స్ జట్టుపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సన్‌రైజర్స్ జట్టుకు గెలిచే అర్హతే లేదని నిప్పులు చెరిగాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు.. అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్‌లను ఒకేసారి ఎంపిక చేసి విజయం సాధించాలనుకోవడం అత్యాశేనని అన్నాడు. ఈ క్రమంలోనే రైజర్స్ యాజమాన్యానికి కూడా చురకలంటించాడు. ప్రత్యర్ధిని 150 పరుగులకే కట్టడి చేయగలిగినా.. మిడిలార్డర్ విషయంలో చేసిన తప్పు వల్లే రైజర్స్ ఓటమి చవి చూసిందని వెల్లడించాడు. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వార్నర్(36: 36బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో(43; 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బెస్ట్ ఓపెనింగ్ లభించినా.. మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేయడం వల్లనే ఓటమి తప్పలేదని పేర్కొన్నాడు.
ఇక కొత్త కుర్రాళ్లపై కూడా మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ సింగ్(12 బంతుల్లో 11; ఫోర్), అభిషేక్ శర్మ(4 బంతుల్లో 2), అబ్దుల్ సమద్(8 బంతుల్లో 7; ఫోర్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మొత్తంగా ముంబైతో మ్యాచ్‌ను చేజార్చుకోవడానికి ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యమే ప్రధాన కారణమని, తుది జట్టు కూర్పు విషయంలో ఇప్పటికైనా పునఃసమీక్షించుకోకపోతే టోర్నీలో ముందుకు వెళ్లడం అసాధ్యమేనని అభిప్రాయపడ్డాడు.
కాగా.. 2016 సీజన్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కూడా ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేదు. తొలుత కలకత్తాపై, ఆ తర్వాత బెంగళూరుపై తాజాగా ముంబైపై మూడు సార్లు కూడా చేతికొచ్చిన మ్యాచ్‌లనే రైజర్స్ కోల్పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే జట్టు ఇంత కష్టాల్లో ఉన్నా కేన్ విలియమ్సన్‌ను తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైజర్స్ యాజమాన్యం దీనిపై క్లారిటీ ఇచ్చింది. విలియమ్సన్‌ను ఎంపిక చేయకపోడంపై ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ మొదటిసారిగా నోరు విప్పాడు. జట్టు కూర్పు విషయంలో ఎటువంటి సమస్య లేదని, విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోడంవల్లనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఫిట్‌నెస్ విషయంలో విలియమ్సన్ కసరత్తు చేస్తున్నాడని, అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చాడు. మరోవైపు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నబీని తప్పించడంపై కూడా బేలిస్ వివరణ ఇచ్చాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నబీ తలకు బలంగా గాయమైందని వెల్లడించాడు.